తెలుగు సింగర్ షణ్ముఖప్రియ ఓ ప్రముఖ ఛానల్లో నిర్వహిస్తున్న "ఇండియన్ ఐడల్" సింగింగ్ కాంపిటీషన్ షోలో అద్భుతమైన ప్రతిభ చూపుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈమె 5 నెలల క్రితం "హమ్మా హమ్మా" హిందీ పాట ఎంతో హుషారుగా పాడి ప్రేక్షకులలో గూస్ బంప్స్ తెప్పించారు. దమ్ మారో దమ్ పాట కూడా అత్యద్భుతంగా పాడి ఇండియన్ ఐడల్ షో ని షేక్ చేశారు. నిజానికి అద్భుతం నేషనల్ వైడ్ గా రాక్‌స్టార్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్న షణ్ముఖప్రియ గతంలో ఓ తెలుగు ప్రముఖ ఛానల్లో "పాడుతా తీయగా" ప్రోగ్రాంలో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేశారు. సాహితీ చాగంటి, శ్రీ లలిత, పరమేశ్వరరావు బ్యాచ్ లో ఈమె కూడా ఒక కంటెస్టెంట్.

అయితే సాహితీ ఇప్పటికే ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్ కాగా.. శ్రీ లలితా ఇంకా సంగీతం నేర్చుకుంటూనే ఉన్నారు. మరోవైపు షణ్ముఖ ప్రియ ఇండియన్ ఐడల్ షోలో తన సత్తా చాటుతున్నారు. న్యాయనిర్ణేతలు కూడా ఆమె సింగింగ్ ప్రతిభను బాగా మెచ్చుకుంటున్నారు. అయితే తాజాగా "రొమాంటిక్ స్పెషల్" ఎపిసోడ్ జరగగా.. షణ్ముఖప్రియ, ఆశిష్ కులకర్ణి కలిసి "హమ్కో సిర్ఫ్ ప్యార్ హై" అనే పాట ఆలపించారు.


అయితే ఈ ఎపిసోడ్ కి విచ్చేసిన స్పెషల్ గెస్ట్స్ కుమార్ సాను, అనురాధ పౌడ్వాల్, రూప్‌కుమార్ రాథోడ్.. షణ్ముఖ ప్రియ పర్ఫామెన్స్ ని బాగా మెచ్చుకున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం షణ్ముఖ ప్రియ ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఇటువంటి చెడ్డ సింగర్ ని వెంటనే షో నుంచి ఎలిమినేట్ చేయాలని చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో నానా రచ్చ సృష్టిస్తున్నారు.

షణ్ముఖప్రియ ఒరిజినల్ పాటను కూని చేసింది. షణ్ముఖప్రియ మధురమైన ఒరిజినల్ పాటలను పరమ నీచంగా పాడటంలో దిట్ట. ఇలాంటి సింగర్ ని నిష్క్రమించాల్సింది పోయి న్యాయనిర్ణేతలు మెచ్చుకోవడం వింతగా ఉంది. ఒరిజినల్ పాటలను తనకి ఇష్టం వచ్చినట్టు పాడుతూ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్న షణ్ముఖ ప్రియ ని వెంటనే షో నుంచి గెంటి వేయాలి అని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: