రామ్ గోపాల్ వర్మ సినిమాలతో ఊర్మిళ మటోండ్కర్ నేషనల్ సెక్స్ సింబల్ గా పేరు తెచ్చుకున్నారు. రామ్ గోపాల్ వర్మ కి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. శ్రీదేవి తర్వాత ఆయన బాగా ఇష్టపడిన నటీమణి ఊర్మిళ మటోండ్కర్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఊర్మిళ రమ్యమైన అందానికి వశమయ్యారు. అయితే ఆమె అందాన్ని సరిగా చూపించడం లో ఇతర దర్శకులు విఫలమయ్యారు కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం సక్సెస్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో నటించక ముందు ఈ హాట్ బ్యూటీ ఊర్మిళ కి ఎటువంటి గుర్తింపు దక్కలేదు. కానీ ఆయన సినిమాల్లో నటించిన తర్వాత ఆమెకు భారత దేశ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ దక్కింది. రంగీలా సినిమాలో ఊర్మిళ అందాలను కెమెరాలో బంధించాలనే ముఖ్య ఉద్దేశం తోనే రామ్ గోపాల్ వర్మ షూటింగ్ ప్రారంభించారని చెబుతుంటారు.



1995లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రంగీలా సినిమాలో ఊర్మిళ కథానాయికగా కనిపించి సెగలు పుట్టించారు. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన అంతం/ద్రోహి సినిమాలో అక్కినేని నాగార్జున సరసన ఊర్మిళ నటించారు. 1998లో క్రైమ్ డ్రామాగా విడుదలైన సత్య సినిమాలో ఊర్మిళ నటించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన గాయం సినిమాలో కూడా ఊర్మిళ ఓ ప్రధాన పాత్ర పోషించి తన అందచందాలతో ఆడియన్స్ ని వెండితెరకి కట్టిపడేసారు. అనగనగా ఒక రోజు సినిమా లో జేడి చక్రవర్తి సరసన నటించిన ఆమె తన అభినయంతో ఫిదా చేశారు.



రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో హారర్ సినిమాగా వచ్చిన భూత్ సినిమాలో ఆమె పర్ఫామెన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అంతేకాదు ఈ సినిమాలో నటించిన ఆమె విమర్శకుల విభాగంలో ఉత్తమ నటీమణిగా నంది పురస్కారం కూడా అందుకున్నారు. ఆమె ఆర్జీవీ సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులకు నామినేట్ కూడా అయ్యారు. వాస్తవానికి అప్పట్లో ప్రేక్షకులు ఆర్జీవీ-ఊర్మిళ కాంబో అంటే పడి చచ్చిపోయేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: