ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు వినూత్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న దిల్ రాజు ఇప్పుడు థియేటర్స్ బాధ్యతల నుండి తప్పుకోబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈ అగ్ర నిర్మాత చేతుల్లో దాదాపు పది సినిమాల జాబితా ఉండగా, వాటిలో మీడియం బడ్జెట్ నుండి  పాన్ ఇండియా బడ్జెట్ సినిమాల వరకు పలు రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. అయినా థియేటర్స్ ను వదులుకోవడమే ప్రస్తుతానికి మంచిదని ఈ ఆలోచన చేస్తున్నట్లు అంటున్నారు. అయితే ఇంత పెద్ద స్టెప్ తీసుకోవాలనే ఆలోచనకు కారణం మహమ్మారి కరోనానే అన్న టాక్ వినిపిస్తోంది.

దీనికి కారణం లేకపోలేదు. ఈ ఏడాదితో తన చేతిలో ఉన్న థియేటర్స్ యొక్క లీజ్ అగ్రిమెంట్ కాలపరిమితి కంప్లీట్ కానుంది. కరోనా కష్ట సమయంలో థియేటర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎటువంటి ఆదాయం లేకుండా వీటిని మెయింటైన్ చేయడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఇదే వే లో ఆలోచిస్తున్న నిర్మాత దిల్ రాజు థియేటర్స్ మెయింటినెన్స్ వదులుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు స్టార్ నిర్మాత ఇలాంటి వాటి కోసం అంత ఈజీగా థియేటర్స్ ని వదులుకోరు అన్న మాటలు కూడా వినబడుతున్నాయి.

అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో రానున్న రోజుల్లో తెలియనుంది. అంతే కాదు థియేటర్స్ ను వీడి ఇప్పుడు మంచి జోష్ లో ఉన్న ఓటిటి లో అడుగు పెట్టనున్నారట  దిల్ రాజు. ఇప్పటికే ఆహా యాప్ లో తన ఫ్యామిలీ మెంబర్స్ ను భాగస్వాములుగా చేసిన ఈయన ఇప్పుడు సొంతంగా తానే ఒక ఓటిటి ఫ్లాట్ ఫామ్ ని నెలకొల్పాలని ఆలోచిస్తున్నారట. భారీ అగ్ర నిర్మాత అయిన దిల్ రాజుకు ఇదేమి అంత కష్టం కాకపోయిప్పటికీ ఓటిటి వైపు నిజంగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: