యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోల్లో ఆయ‌న మేన‌రిజం డిఫ‌రెంట్‌గా ఉంటుంది. పాత్ర ఏదైనా దాన్ని పండించ‌డంలో ఆయ‌న దిట్ట‌. మాస్ ఫాలోయింగ్‌లో మ‌రే హీరోకు లేనంత అభిమానుల సంఘాలు ఆయ‌న‌కే ఉన్నాయి. ఆయ‌న సినిమా వ‌చ్చిందంటే టాలీవుడ్ రికార్డుల లెక్క‌లు రాసుకోవాల్సిందే.

మ‌రి అంతాగా ఫ్యాన్ బేస్ ఉన్న హీరోకి రెమ్యున‌రేష‌న్ ఎలా ఉంటుంది. టాప్ లోనే ఉంటుంది. క‌దా. అయితే ఇప్పుడు ఆయ‌న చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గాను పారితోషికం, లాభాల్లో వాటా కలిపి దాదాపుగా రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఒక‌వేళ ఆర్ ఆర్ ఆర్ సినిమా గ‌న‌క‌బాహుబలి రేంజ్ లో సక్సెస్ అయితే ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ మరో 20కోట్ల వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉంది. అయితే ఎన్టీఆర్ త‌న మొద‌టి సినిమాకు తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసుకోవాల‌ని అంద‌రికీ ఉంటుంది క‌దా.


 
ఈ నంద‌మూరి వారసుడు సినిమాల్లోకి వచ్చి దాదాపుగా 20ఏళ్ల దాటింది. మొద‌ట్లో పారితోషికాలు చాలా తక్కువగానే ఉన్నాయి. కాబ‌ట్టి ఓ 25లక్షల వరకు ఎన్టీఆర్ తీసుకుని ఉంటాడని అనుకుంటే పొరపాటే. అప్పట్లో కూడా హీరోలు కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారు. మ‌రి అంత క్రేజ్ ఉన్న టైమ్‌లో కూడా ఎన్టీఆర్ త‌న మొదటి పారితోషికంను రామోజీరావు ద‌గ్గ‌ర తీసుకున్నాడు. ఎంత‌నుకున్నారు? 4ల‌క్ష‌లు మాత్ర‌మే. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో తీసిన ఎన్టీఆర్ మొద‌టి సినిమాకు వంకినేని రత్న ప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఆ సినిమా పేరు నిన్ను చూడాలని.


సినిమా తీసేట‌ప్పుడు ఎన్టీఆర్ వ‌య‌స్సు 17 ఏళ్లు మాత్ర‌మే. అయితే ఆ సినిమా పూర్త‌య్యే సరికి ఎన్టీఆర్ 18వ ఏట అడుగు పెట్టాడు. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా తాను తీసుకున్న నాలుగు లక్షల పారితోషికంను చాలా కాలం పాటు గుర్తు పెట్టుకున్నాడు ఎన్టీఆర్‌. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక అమ్మ చేతిలో ఆ డబ్బును పెట్టాడట. చాలా సార్లు ఆ డ‌బ్బును లెక్క పెట్టుకునేవాడంట‌. ఎందుకంటే మొద‌టి సంపాద‌న క‌దా. ఇప్పుడైతే లెక్క‌పెట్టుకోలేనంత పారితోష‌కం తీసుకుంటున్నాడు క‌దా.

మరింత సమాచారం తెలుసుకోండి: