మళయాళ సినిమాలకు సంబంధించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన పేర్లు మమ్ముట్టి మోహన్ లాల్ పృథ్వీరాజ్ లు వెంటనే గుర్తుకు వస్తారు. అయితే ఇప్పుడు మళయాళ సినిమాలకు సంబంధించి ఒక కొత్త స్టార్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఆహా ఓటీటీ తెలుగు వారికి బాగా కనెక్ట్ అవుతోంది.


ఒకవైపు ఒరిజినల్ కంటెంట్ తో ఉన్న చిన్న సినిమాలు ఆహా లో విడుదల చేస్తూనే మ‌లళయాళ సినిమాల‌ను తెలుగులో డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేయ‌డం ఆహా ముందు వరసలో ఉంది. ముఖ్యంగా మ‌ళయాళ సినిమాలకు సంబంధించి టొవినో థామ‌స్ సినిమాల పై ఆహా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.


‘ఫోరెన్సిక్’ ‘వ్యూహం’ ‘అండ్ ద ఆస్కార్ గోస్ టు’ టొవినో న‌టించిన చాలా సినిమాల‌ను ఆహా డ‌బ్ చేసి రిలీజ్ చేసింది. మ‌ల‌యాళంలో టొవినో అనే న‌టుడున్నాడ‌ని చాలామందికి తెలుసు కాని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అతడు పెద్దగా పరిచయం లేడు. దీనితో చాలామంది సోషల్ మీడియాలో జోక్స్ వేస్తున్నారు. ఆహా టొవినో థామ‌స్ ఫ్యాన్స్ అసోసియేష‌న్ గా మారిపోయింది అంటూ కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.



టొవినో థామస్ కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు దానిని దాన్ని తెలుగు డ‌బ్బింగ్‌ గా మార్చి ఆహా లో స్ట్రీమ్ చేస్తున్న అరవింద్ కొత్త వ్యూహానికి చాలామంది ఆశ్చర్య పడుతున్నారు. లేటెస్ట్ గా కొన్ని రోజుల కింద‌టే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన టొవినో మూవీ ‘కాలా’ ను ఆహా నిర్వాహకులు తెలుగులో డబ్ చేసి జూన్ 4న ఈ చిత్రానికి ప్రిమియ‌ర్స్ ప‌డ‌బోతున్న‌ట్లు ఆహా బాగా పబ్లిసిటీ ఇస్తోంది. దీనితో రానున్న రోజులలో అల్లు అరవింద్ మెగా ఫ్యామిలీ హీరోలతో కాకుండా టొవినో తో డైరెక్ట్ తెలుగు సినిమాను తీసి ఏకంగా మెగా యంగ్ హీరోలకు షాక్ ఇస్తాడేమో అంటూ మరికొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: