మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ ప్ర‌స్తుం టాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒక‌రిగా ఎదిగారు. మెగా త‌న‌యుడిగా ఎంట్రీ ఇచ్చిన చ‌ర‌ణ్ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నారు. మాస్ క్లాస్ సినిమాలు చేసి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు పొందారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రంగ‌స్థ‌లం సినిమాలో న‌టవిశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. అయితే చ‌ర‌ణ్ స్టార్ హీరోగా ఎదిగేందుకు ఆచితూచి క‌థ‌ల‌ను ఎంచుకోవడం కూడా ఒక కార‌ణ‌మ‌నే చెప్పాలి. అలా క‌థ‌ల‌ను ఎంపిక చేసుకున్న స‌మ‌యంలో చ‌ర‌ణ్ నాలుగు సినిమాల‌ను రిజెక్ట్ చేశారు. ఆ నాలుగు సినిమాల‌కు తెలుగు ప్రేక్ష‌కులను కూడా మెప్పించ‌లేక పోయాయి.

1.2015 లో విడుద‌లైన ఓకే బంగారం సినిమా ముందుగా రామ్ చ‌ర‌ణ్ వ‌ద్ద‌కే వ‌చ్చింది. కాగా ఈ ప్రేమ క‌థ‌ను రామ్ చ‌రణ్ రిజెక్ట్ చేయ‌డంతో  హీరో దుల్క‌ర్ సల్మాన్ వ‌ద్ద‌కు వెళ్లింది. ఈ సినిమాకు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సినిమాలో హీరోయిన్ గా నిత్యామీన‌న్ న‌టించింది. త‌మిళంలో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వ‌చ్చినప్ప‌టికీ తెలుగు ప్రేక్షకుల‌కు ప‌ర‌మ బోరింగ్ సినిమా అనిపించింది.

2.ర‌వితేజ హీరోగా న‌టించిన నేల టికెట్టు సినిమా క‌థ మొద‌ట చ‌ర‌ణ్ వ‌ద్ద‌కే వ‌చ్చింది. అయితే క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసారు. దాంతో ఈ సినిమా క‌థ ర‌వితేజ వ‌ద్ద‌కు వెళ్లింది. ఆయ‌కు న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం అట్ట‌ర్ ఫ్లాప్ గా నిలిచింది.

3.నాని హీరోగా న‌టించిన ప్రేమ క‌థా చిత్రం ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు చిత్రం కూడా మొద‌ట‌గా చ‌ర‌ణ్ వ‌ద్ద‌కే వ‌చ్చింది. కానీ ఆరెంజ్ సినిమాతో దెబ్బ‌తిన్న చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని తిరస్క‌రించారు. దాంతో గౌత‌మ్ మీన‌న్ నానిని ఒప్పించారు. నాని స‌మంత జంట‌గా న‌టించిన ఈ సినిమా అతికొద్దిమంది ప్రేక్ష‌కుల‌కే న‌చ్చింది.

4.డ‌బుల్ యాక్ష‌న్ చిత్రం క్రిష్ణార్జున యుద్దం కూడా మొద‌ట రామ్ చ‌రణ్ వ‌ద్ద‌కే వ‌చ్చింది. అయితే చ‌ర‌ణ్ నో చెప్ప‌డంతో ఈ సినిమా కూడా నాని వ‌ద్ద‌కు చేరింది. క‌థ న‌చ్చ‌డంతో నాని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ చిత్రానికి మేర్ల‌పాక్ గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన ఈ చిత్రం కూడా ఫ్లాప్ టాక్ ను  మూట‌గ‌ట్టుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: