వెండితేర జోడిలకైనా ఇంత క్రేజ్ వస్తుందో లేదో తెలియదు కానీ అటు బుల్లితెర పై మాత్రం ఈ రేంజ్ లో ఒక జోడి క్రేజ్ రావడం మాత్రం ఇదే మొదటి సారి అని చెప్పవచ్చు. ఇక వీరిద్దరి మధ్య జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి ప్రేమాయణం నడుస్తుందని.. ఒకరంటే ఒకరికి ప్రాణమని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ తామిద్దరం మాత్రం మంచి స్నేహితులం అంటూ ఇద్దరు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. అయితే ఇక జబర్దస్త్ స్టేజ్ పై ఎక్కువగా ఈ జోడి అలరిస్తూ ఉంటుంది. ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడమే కాదు కొన్ని కొన్ని సార్లు ఒకరిపై ఒకరు ఎన్నో పంచులు కూడా వేసుకుంటూ ఉంటారు.
ఇటీవలే రష్మీ సుధీర్ పై వేసిన పంచ్ మాత్రం అభిమానులందరినీ షాక్కి గురిచేసింది. ఏకంగా సుధీర్ ఒక ముదిరిపోయిన బెండకాయ అంటూ పంచ్ వేసి పగలబడి నవ్వింది రష్మి. ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు వారెవ్వా ఇక ఈ వారం కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పక్క అని భావిస్తున్నారు. ఇక పోతే ఇక సుడిగాలి సుధీర్ టీమ్ స్కిట్ చేస్తున్న సమయంలో.. మధ్యలో కలగజేసుకున్న రష్మి సుదీర్ ఒక ముదిరిపోయిన బెండకాయ అంటూ పంచ్ వేస్తుంది. దీంతో అక్కడున్న జడ్జెస్ అందరూ నవ్వుకుంటారు. కానీ సుధీర్ ఫ్యాన్స్ మాత్రం రష్మి ఇలా అనేసింది ఏంటి అంటూ షాక్ అవుతారు.