బాహుబలి సినిమా ద్వారా ఎంతోమంది సాధారణ హీరోలు కూడా స్టార్ హీరోలుగా పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగి, ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లపైనే మొగ్గు చూపుతుండటం గమనార్హం. రాజమౌళి జీవితాన్ని మరింత అత్యధిక స్థానానికి తీసుకువెళ్లిన సినిమా ఇది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే కేవలం స్టోరీ మాత్రమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సినిమా స్టోరీ అంతా మహిష్మతి రాజ్యం చుట్టే తిరుగుతుంది. ఈ రాజ్యం లో జరిగిన పరిణామాలన్నింటినీ దర్శకుడు రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దాడు.
ఇక ముఖ్యంగా ఈ సినిమాలో ఆర్ట్ డిజైన్ అదిరిపోయే విధంగా ఉండడమే కాకుండా, ఎక్కువగా గ్రాఫిక్స్ ను ఉపయోగించారు. ఇక మాహిష్మతి రాజ్యం కోసం ప్రత్యేకంగా సెట్ వేశారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ మాహిష్మతి రాజ్యం మన భారతదేశంలో నిజంగానే ఉందనే విషయం మాత్రం కొంతమందికే తెలుసు. మరి ఆ మహిష్మతి రాజ్యం ఎక్కడుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కార్గోన్ జిల్లాలో మాహిష్మతి రాజ్యపు ఆనవాళ్లు ఉన్నాయి. ఇండోర్ నుంచి 91 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్మదా నది తీరంలో కి వెళితే, పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించిన కట్టడాలను మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అయితే ప్రస్తుతం మహేశ్వర్ పట్టణంగా పిలుచుకుంటున్న దీనిని అప్పట్లో మాహిష్మతి అని పిలిచేవారట. అంతేకాదు మహాభారతం, రామాయణం లో కూడా ఈ మాహిష్మతి రాజ్యం ప్రస్తావన ఉంటుంది.
ఒకవేళ ఇప్పుడు కనుక మనం వెళ్ళినట్లయితే, పెద్ద పెద్ద కట్టడాలు, ఆ కాలం నాటి ఆలయ గోపురాలు మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా 18 వ శతాబ్దంలో అహల్య భాయ్ హోల్కర్ తన భర్త మరణానంతరం, మాహిష్మతి సామ్రాజ్యాన్ని, నది ఒడ్డున చేసుకొని దేశాన్ని పాలించారని చెబుతుంటారు. అంతేకాకుండా మహేశ్వర్ లో ఇప్పటికీ 11 అఖండ దీపాలు నాటినుండి వెలుగుతూనే ఉన్నాయి. ఇక ధర్మరాజు మాహిష్మతి రాజ్యాన్ని నిశాధరాజ్యపు రాజు చేజిక్కించుకొని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. కురుక్షేత్ర యుద్ధం తరువాత ధర్మరాజు మాహిష్మతి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేకపోయింది. ఇక ఇప్పటికీ చెక్కుచెదరని కోటను మనం మహేశ్వర్ లో చూడవచ్చు.