చిత్ర పరిశ్రమకి ఎప్పటికపుడు కొత్త నటులు పరిచయం అవుతూనే ఉంటారు. ఆలా వచ్చిన వారిలో హీరో హీరోయిన్స్ గా కొన్ని జంటలు హిట్ ఫెయిర్ గా నిలుస్తాయి. అంతేకాదు, మంచి ఫ్రెండ్షిప్ కూడా సాగిస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి, రాధిక కలిసి దాదాపు 25 చిత్రాలకు పైగా కల్సి నటించిన ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి, రాధిక స్నేహం కొనసాగుతోంది. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు.


ఇక బాలకృష్ణ, స్టార్ హీరోయిన్ రోజా. వీరిద్దరూ వేరువేరు పార్టీలు అయినప్పటికీ మంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. ఇక ప్రభాస్స్వీటీ అనుష్క ల మధ్య కూడా ఏదో ఉందని పుకార్లు వచ్చినా కొట్టిపారేసి, మంచి స్నేహితులుగా ఉంటున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు పలుసార్లు వార్తలు కూడా వచ్చాయి. జెనీలియా, హీరో రామ్ పోతినేని వీరిద్దరూ మంచి స్నేహితులు. నిజానికి ఇద్దరూ కల్సి చేసింది ఒకే సినిమా అయినా స్నేహ బంధం ఏర్పడింది. రామ్ ముంబై వెళ్తే, జెనీలియా ఇంటికి వెళ్తాడు. ఆమె హైదరాబాద్ వస్తే, రామ్ ఇంట్లో ఉంటుంది.



అంతేకాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ . వీరు మగధీరతో సహా నాలుగు సినిమాల్లో కల్సి నటించారు. అలాగే హీరో బెల్లంకొండ సురేష్ తో కూడా కాజల్ కి మంచి స్నేహం ఉంది. అంతేకాదు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రాశిఖన్నా బయట కొట్టుకున్నట్లు కన్పిస్తారు కానీ, మంచి ఫ్రెండ్స్. నేను లోకల్ మూవీతో నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ మధ్య ఏర్పడ్డ స్నేహం కొనసాగుతోంది. అలాగే నివేదితా థామస్ తో కూడా నానికి మంచి స్నేహం ఉంది. రోజుకి ఒకసారైనా ఇద్దరూ పలకరించుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: