టాలీవుడ్ పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కెరీర్ ని కనుక మనం పరిశీలిస్తే ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్స్ అందుకోవడం జరిగింది. ఆ విధంగా వరుసగా విజయాలతో కొనసాగుతున్న రాజమౌళి తొలిసారిగా తెలుగు సినిమా పరిశ్రమకు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. గజాల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు విలన్ గా చేసారు. 2002లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత సింహాద్రి, సై, ఛత్రపతి మొదలుకుని మొన్నటి బాహుబలి 2 వరకు అన్ని సినిమాలతో కూడా సక్సెస్ లు అందుకుంటూ వెళ్తున్న జక్కన్న ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ పాన్ ఇండియా మూవీ తీస్తున్న విషయం తెలిసిందే.

అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాని అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీ తరువాత దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మాతగా సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఒక భారీ మూవీ చేయనున్నారు రాజమౌళి. ఇటీవల ఈ మూవీ అనౌన్స్ మెంట్ కూడా చేసారు రాజమౌళి. అయితే ప్రస్తుతం పూర్తిగా ఆర్ఆర్ ఆర్ పనుల్లో బిజీ బిజీగా ఉన్న రాజమౌళి, ఆ మూవీ విడుదల తరువాతనే మహేష్ మూవీ గురించి ఆలోచిస్తారని, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ ఇటీవల నిర్మాత నారాయణ వెల్లడించారు.

అయితే ఈ సినిమాల తరువాత రాజమౌళి చేయనున్న తదుపరి సినిమాకి సంబందించిన ఒక న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మహేష్ మూవీ తరువాత రాజమౌళి మరొక్కసారి రెబల్ స్టార్ ప్రభాస్ తో పని చేయనున్నారని, బాహుబలి సినిమాలను మించేలా ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా దాదాపుగా వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందనున్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే మరొకసారి జక్కన్న, ప్రభాస్ ల కాంబో లో మరొక భారీ బ్లాక్ బస్టర్ వచ్చినట్లే ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: