నందమూరి బాలకృష్ణ అంటే సినీ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన నటనతో, పంచ్ డైలాగులతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే బాలకృష్ణ తన సినీ కెరియర్ లో, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హిట్ సినిమాల కంటే ప్లాప్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య హీరోగా నటించి, భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమాలే ఎక్కువగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. అయితే బాలకృష్ణ నటించిన ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో ఇప్పుడు తెలుసుకున్నాను.
వై.వి.యస్.చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కిన "ఒక్క మగాడు" సినిమా 2008 వ సంవత్సరం జనవరి 10 న విడుదల అయింది. ఈ సినిమాకు ముందు వై.వి.యస్ డైరెక్షన్లో తెరకెక్కించిన సినిమాలు బాగా హిట్ అయ్యాయి. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఒక్క మగాడు సినిమా ఫస్ట్ షో తోనే ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాన్ని చవిచూపించింది. అయితే ఆయన సినిమా గురించి మాట్లాడుతూ ఇలా వెల్లడించారు.
"ఒక్క మగాడు.. సినిమా ముందు వైలెన్స్ ఎక్కువగా ఉన్న సినిమాల్లో నటించారని, ఆ సమయంలో హింస లేకుండా ఒక్క మగాడు సినిమాను తెరకెక్కించడం తన తప్పిధమని వై.వి.యస్.చౌదరి అన్నారు. బాలయ్య మూవీ కథ విషయంలో తన ఆలోచన తప్పు కావడంతో ఈ సినిమా ఫ్లాప్ అయిందని వై.వి.యస్.చౌదరి వెల్లడించారు".
అయితే బాలయ్య సినీ కెరియర్ లో మాత్రం ఒక్క మగాడు సినిమా పెద్ద డిజాస్టర్ లిస్టులో ఒకటి కావడం గమనార్హం. ఈ సినిమాలో బాలకృష్ణ జతగా నటించింది అనుష్క. కానీ అభిమానుల నుంచి కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమా పోలిక ఉందని కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ మూవీలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవల అఖండ సినిమా టీజర్ కూడా మంచి వ్యూస్ ను నమోదు చేసుకోవడం గమనార్హం . ఇక ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అఖండ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుందాం.