
ఇక ఇప్పుడు మరో రికార్డు క్రియేట్ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నెట్ వర్క్ గ్రూప్ కు చెందిన 'హైదరాబాద్ టైమ్స్' విభాగం ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాను ప్రకటించింది. దీంట్లో 2020 సంవత్సరానికి గాను 30 మంది ముద్దుగుమ్మలతో ఈ లిస్టును విడుదల చేసింది. దీంట్లో టాప్-10 సెలబ్రిటీలు వీళ్లే.
ఇక మోస్ట్ డిజైరబుల్ ఉమెన్' టైటిల్ ను నెం.1 ప్లేతో ఎగరేసుకుపోయింది శృతిహాసన్. అంతకు ముందు 2013లో తొలిసారి ఈ టైటిల్ ను గెలుచుకొన్న శృతి.. ఆ తర్వాత దాన్ని దక్కించుకోలేకపోయింది. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఆ టైటిల్ను దక్కించుకుంది. ముప్పై ఏళ్లు దాటినప్పటికీ తన అందంతో కుర్రకారు మతులను పోగొడుతూనే ఉంది ఈ పిల్ల. ఇటీవల 'క్రాక్' 'వకీల్ సాబ్' సినిమాలతో మంచి హిట్ కొట్టింది.


