టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి అంటే ఒక మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. తనతో పాటు సినిమాలలో ఎంతో మంది హీరోయిన్లు నటించారు. అలా నటించిన ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఏదో ఒక స్థాయిలో మంచి పొజిషన్ లోనే ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం మీనాక్షి శేషాద్రి కూడా ఒకరు. మీనాక్షి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె.విశ్వనాధ్ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు గారి డైరెక్షన్ లో  తీసిన చిత్రం "ఆపద్బాంధవుడు". ఈ చిత్రం చిరంజీవి కెరియర్ లో ఒక క్లాసిక్ సినిమాగా మిగిలిపోయింది. కానీ ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆడలేదు.

ఇక అసలు విషయానికి వస్తే, ఇందులో హీరోయిన్ గా, చిరంజీవి సరసన నటించింది  మీనాక్షి శేషాద్రి..  ఇప్పుడు చూస్తున్న ఫోటో ఆమెదే. ఆ సినిమాలో ఎంతో అందంగా కనిపించిన మీనాక్షి, ఇప్పుడు ఈమెను చూసి ప్రేక్షకులు అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈమె ఇంతలా అయిపోయింది ఏంటీ అని కూడా కామెంట్ చేస్తున్నారు.

నిజానికి ఈ హీరోయిన్ కి మొదటి సినిమా ఆపద్బాంధవుడు కాదు. సీనియర్ ఎన్టీఆర్ అలాగే నందమూరి బాలకృష్ణ లు కలిసి నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించింది. కానీ అక్కడ మాత్రం ఈమెకు ఊహించిన స్థాయిలో గుర్తింపు రాలేదు  . కాని ఈమెకు పేరు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం"ఆపద్బాంధవుడు". డైరెక్టర్ విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా కాబట్టి ఈమెను అచ్చం తెలుగమ్మాయిలా చూపించారు. ప్రస్తుతం మీనాక్షి  విదేశాల్లో ఉంటున్నారు.

ఈమె 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత నెమ్మదిగా సినిమాలకు దూరం అయింది. ఈ హీరోయిన్ కి ఇద్దరు పిల్లలు. అయితే ఇటీవల సోనాక్షి షేర్ చేసిన ఫోటోలు  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలను మీరు కూడా ఒకసారి చూసేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: