తెలుగు చిత్ర పరిశ్రమలో జర్నీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది తెలుగు భామ అంజలి. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకుంది.  అయితే నటన పరంగా ఎంతో టాలెంట్ ఉన్న అంజలికి అటు అదృష్టం మాత్రం అంతగా కలిసిరాలేదు. స్టార్ హీరోల సినిమాల్లో చేసినప్పటికీ.. సరైన అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది అంజలి.  అయితే కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ కన్నడ, భాషలలో కూడా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది.


 ఇక ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా అయినా వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటించింది అంజలి. ఈ సినిమాలో అంజలి నటనకు గానూ ఎన్నో ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటోంది అయితే ఎవరైనా హీరోయిన్కు కాస్త వయసు వచ్చింది అంటే చాలు ఇక ఆ హీరోయిన్ పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.  ఇప్పుడు అంజలి పెళ్లి గురించి కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే...  ఇటీవలే తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది ఈ రాజోలు భామ.



 అందరూ హీరోయిన్స్ చెప్పే రోటీన్ డైలాగులే చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే అంజలి ఓ ఇంటర్వ్యూలో హాజరైన సమయంలో ప్రస్తుతం అందరూ లాక్ డౌన్లోడ్ పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు.. మరి  మీ పెళ్ళెప్పుడు అంటూ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ తన కెరీర్ పైనే ఉందని..  అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు అంటూ స్పష్టం చేసింది అంజలి.  వకీల్ సాబ్ తో ఎంతోమంది దర్శకులను ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ.. వరుస అవకాశాలు అందుకుంటోంది. అటు తమిళ, కన్నడ భాషలలో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది అంజలి.

మరింత సమాచారం తెలుసుకోండి: