బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈ షోకి ఆడియన్స్ బ్రహ్మా రథం పడుతున్నారు. మొదట్లో ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన ఈ షో.. మెల్ల మెల్లగా తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకొని.. అతి త్వరలో ఐదో సీజన్ కి కూడా రెడీ అయిపోయింది బిగ్ బాస్. ఇక పోయిన సీజన్4 కి భారీ టీఆర్పీ దక్కి గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇప్పుడు సీజన్5 ని మరింత రసవత్తరంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే మొదలు కావాల్సిన ఐదో సీజన్ కరోనా వ్యాప్తి తో వాయిదా పడుతూ వచ్చింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఐదో సీజన్ కి ముహూర్తం ఖరారైందట.ఇప్పటికే ఐదో సీజన్‌ను మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట నిర్వహకులు.ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్‌ను జూమ్ మీటింగ్స్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తున్నారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.అందుతున్న సమాచారం ప్రకారం మరో వారం పదిరోజుల్లో ఫైనల్ కంటెస్టెంట్స్‌ను ఖరారు చేసి, వారిని క్వారంటైన్‌లో ఉంచి తర్వాత సీజన్‌ను స్టార్ట్ చేస్తారట. అన్ని అనుకున్నట్లు జరిగితే జూలై రెండో వారంలో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రారంభం కానునట్లు తెలుస్తోంది.

ఇక ఈ లేటెస్ట్ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ పేర్లు కూడా కొన్ని బయటికి వచ్చినట్లు సమాచారం. అందులోయూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్‌ ప్రవీణ్‌, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్‌ మంగ్లీ, న్యూస్ యాంకర్ ప్రత్యూష తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో శేఖర్ మాస్టర్,సింగర్ మంగ్లీ, హైపర్ ఆది వంటి వాళ్ళు ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నేపథ్యంలో వీళ్ళు బిగ్ బాస్ సీజన్5 లో పాల్గొంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక ఈ ఐదవ సీజన్ ని కూడా కింగ్ నాగార్జున గారే హోస్ట్ చేయనున్నన్నట్లు వినికిడి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: