అయితే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైన తరువాత అందరి సందేహాలు పటాపంచలు అయ్యాయి. రాజ్ డికె క్రియేట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో టాస్క్ ఫోర్స్ అధికారిగా మనోజ్ బాజ్పేయి నటనతో సరిసమానంగా సమంత రాజీ పాత్ర అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా తన రాజీ పాత్రకు లభించిన ప్రశంసల పై భావోద్వేగానికి గురైన సమంత మాట్లాడుతూ రాజీ పాత్రలో సున్నితత్వం సమతుల్యత అవసరమని తనకు తెలుసని ద్వేషం అణచివేత దురాశ పై పోరాటానికి మనుషులుగా కలిసి రావడానికి పూర్తిగా అవసరమైన రిమైండర్ గా డిజైన్ చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది.
ఈ వెబ్ సిరీస్ పై విమర్శల ప్రశంసలు చదివాకా తనకు భావోద్వేగం కలిగిన విషయాన్ని బయటపెట్టింది. తన నటనకు సంబంధించిన విషయాల పై మాట్లాడుతూ రాజీ పాత్రను పోషించే విషయంలో తాను తమిళ మహిళల కథలతో పోరాటాలకు సంబంధించిన డాక్యుమెంటరీలను అనేకం చూశానని ఈలం తమిళులు సుదీర్ఘకాలం అనుభవించిన ఇబ్బందులు అంతులేని దుఃఖం చూసి తాను బాధ పడటంతో తన నటనలో అలాంటి సహజత్వం వచ్చిందని కామెంట్స్ చేసింది.
దాదాపు వేలాది మంది ఈలం ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయిన ఆ పోరాటానికి సంబంధించిన కథ కావడంతో తాను ఆ వెబ్ సిరీస్ లో నటిస్తున్నప్పుడు తనకెంతో భావోద్వేగం కలిగిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. అంతేకాదు తాను నటించిన రాజీ కథ యుద్ధంతో బాధాకరమైన జ్ఞాపకాల్లో జీవించే వారికి నివాళి అంటూ సమంత కామెంట్స్ చేయడంతో సమంత పై కోపంతో రగిలి పోతున్న తమిళ ప్రజల కోపాగ్ని చల్లారుతుంది అనుకోవాలి..