తమిళనాట స్టార్ దర్శకుడిగా ఉన్న దర్శకుడు మురుగదాస్ తెలుగు నాట మాత్రం తన సత్తా చాట లేకపోతున్నాడు. తమిళ స్టార్ హీరోలు అందరికీ తనదైన స్టైల్ లో సినిమాలు చేసి సూపర్ హిట్ లు అందించాడు మురుగదాస్. సౌత్ లోనే కాకుండా నార్త్ లో బాలీవుడ్లో కూడా సినిమాలు చేసి అక్కడ హీరోలకు హిట్ల ను అందించగా తెలుగులో మాత్రం భారీ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. గజిని సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని దక్కించుకున్నాడు మురుగదాస్. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ కావడంతో ఆయనకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది.

సినిమా చూసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరి తనకు ఓ సినిమా చేయాలని ఆఫర్ ఇవ్వగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు మురుగదాస్. మెగాస్టార్ చిరంజీవి మురుగదాస్ దర్శకత్వంలో నటించిన స్టాలిన్ సినిమా  యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత సెవెంత్ సెన్స్, తుపాకీ, కత్తి, సర్కార్ దర్బార్ వంటి సినిమాలతో స్టార్ దర్శకుడిగా తమిళనాడు ఏలుతున్నారు. సినిమాలు కూడా నిర్మిస్తూ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.

తెలుగులో ఆయన చేసిన తొలి సినిమా పరిస్థితి అలా ఉంటే రెండవ సినిమా స్పైడర్ మాత్రం దారుణం ఫలితాన్ని మిగిలిచింది. మహేష్ బాబు కెరీర్ లోనే దారుణమైన ప్లాప్ చిత్రంగా స్పైడర్ సినిమా నిలవగా మహేష్ బాబు అభిమానుల విమర్శలను ఎదుర్కొన్నాడు ఈ సినిమా రిలీజ్ టైమ్ లో మురుగదాస్. కాగా ప్రస్తుతం మరో సినిమా కూడా మహేష్ బాబు చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తుండగా తాజాగా రామ్ పోతినేని కి కూడా ఓ  కథ చెప్పి ఒప్పిచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇది గతంలో అల్లు అర్జున్ కి చెప్పిన కథని అల్లు అర్జున్ చేయడంతో ఆ కథను రామ్ పోతినేని చెప్పి ఒప్పించాడనీ అంటున్నారు. మరి తెలుగు హీరోలతో హిట్ కొట్టని మురుగదాస్ ఈ సారి చేసే తెలుగు సినిమాతో హిట్ కొడతాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: