ఇక అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సోనూసూద్, రేణూ దేశాయ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా లాంటి ఎంతో మంది ప్రముఖ సెలబ్రెటీలు కోట్లకు కోట్లు తమ వంతు సాయంగా ఇచ్చారు. ఇక కోలివుడ్ లో కూడా ఇదే జరిగింది . ఇక ఇప్పుడు వీరందరి బాటలో ప్రముఖ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ కూడా తన వంతు సహాయం చేసింది. అదేమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
కుర్రకారు హృదయాలను దోచుకున్న సన్నీ లియోన్ అంటే ప్రతి ఒకరికి తెలుసు. ఈమె సినిమాలు ఎక్కువగా యూత్ ని ఆకర్షిస్తుంటాయి. తను నటించే సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఇస్తుండడంతో పాటు , సొసైటీ లో కూడా తన వంతు సహాయంగా నేను చేస్తాను అంటూ ముందుకు వచ్చింది ఈ హాట్ బ్యూటీ.
కరోనా వైరస్ మహమ్మారి దేశమంతటా వ్యాపిస్తున్న నేపథ్యంలో , ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా పేదవారికి అన్నం కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక సన్నీ లియోన్ అలాంటి వారి కోసం తన భర్తతో కలిసి, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆకలితో ఎవరూ బాధపడకుండా ఉండేందుకు పిల్లలకు ఆహారం పంపిణీ చేస్తోంది.
ఇలాంటి సామాజిక పనులు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తోంది సన్నీలియోన్. అంతేకాకుండా తన భర్త డానియల్ వెబర్ తో కలిసి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తోంది. కష్టకాలంలో తన వంతు సహాయంగా పేదవాడి కడుపు నింపుతున్న సన్నీలియోన్ గొప్ప మనసుకు నెటిజన్లు ఎంతో సంబరపడుతున్నారు. ఇక ఈమె లాగే ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఆలోచించగలిగితే, మన దేశంలో పేదవాడి సమస్య సగం తీరినట్టే అని చెప్పవచ్చు.