ప్రముఖ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ ఫేమ్ మనోజ్ భాజ్ పెయీ.. బాలీవుడ్ నటీమణి నేహా ని 2006 ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకున్నారు. గత 15 సంవత్సరాలుగా వీరిద్దరూ తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా కొనసాగిస్తున్నారు. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఎలాంటి తగువులు పెట్టుకోకుండా తమ వైవాహిక బంధాన్ని మరింత ధృఢ పరుస్తూ వస్తున్నారు. అయితే వీళ్ళిద్దరికీ అవా నయల అనే ఒక పాప కూడా ఉంది. నేహా అసలుపేరు షబానా రజా కాగా.. ఆమె పేరుని బలవంతంగా నేహా అని చేంజ్ చేశారట. తనకు తన తల్లిదండ్రులు గౌరవంగా పెట్టిన పేరే నచ్చుతుందని ఆమె అంటారు. 1990-2000 కాలంలో నేహా బాలీవుడ్ చిత్రాల్లో కథానాయిక పాత్రలు పోషించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

ఆమె బాబీ డియోల్ హీరోగా నటించిన కరీబ్(1998) అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. కొద్ది నెలల వ్యవధిలోనే ఆమె 'హోగీ ప్యార్ కి జీత్' సినిమాలో నటించారు. బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్ల వరకు వసూలు చేసిన ఈ చిత్రంలో హీరోగా అజయ్ దేవ్‌గన్‌ నటించారు. నేహా హృతిక్ రోషన్ తో కూడా కలిసి నటించారు. 2000 సంవత్సరంలో క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఫిజా సినిమాలో హృతిక్ రోషన్, కరిష్మా కపూర్, నేహా, జయా బచ్చన్ తో పాటు మనోజ్ భాజ్ పెయీ నటించారు. 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 32 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ చిత్రంలో హీరో హృతిక్ రోషన్ తో నేహా రొమాన్స్ చేశారు.

కరీబ్ సినిమా చేసిన వెంటనే నేహా కి మనోజ్ పరిచయమయ్యారు. అనంతరం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత నేహా ఆత్మ, యాసిడ్ ఫ్యాక్టరీ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆమె అడపాదడపా టీవీ ప్రకటనలలో నటించారని తెలుస్తోంది. తమ పాప పెద్దయిన తర్వాత నేహా మళ్లీ సినిమాల్లో నటిస్తుందని మనోజ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు

మరింత సమాచారం తెలుసుకోండి: