హీరోయిన్ స్నేహా ని అందానికి ప్రతిరూపం అని చెప్పుకోవచ్చు. స్నేహ.. వెంకీ, రాధాగోపాలం, శ్రీరామదాసు చిత్రాల్లో నటించి టాలీవుడ్ పరిశ్రమలో స్టార్ డమ్ తెచ్చుకున్నారు. అయితే ఈమె తెలుగు సినిమాల్లో కంటే తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. 2006వ సంవత్సరంలో ఆమె సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన పుదుపేట్టే( తెలుగు వెర్షన్: దూల్ పేట) సినిమాలో ఒక వేశ్య పాత్రలో నటించారు. పొలిటికల్ గ్యాంగ్ స్టర్ డ్రామా గా రూపొందిన ఈ చిత్రంలో ధనుష్, సోనియా అగర్వాల్, స్నేహ ప్రధాన పాత్రల్లో నటించారు.


ఇక ఈ చిత్రం కథ గురించి తెలుసుకుంటే.. తండ్రి తన తల్లి ని చంపేసిన తర్వాత హీరో ధనుష్ దిగ్భ్రాంతికి గురి అవుతారు. తనని కూడా తన తండ్రి ఎక్కడ చంపేస్తాడోనని ఇంటినుంచి పారిపోతారు. సిటీకి చేరుకున్నాక ఆకలితో అలమటిస్తూ బిక్షాటన చేస్తారు. ఆ సమయంలోనే అతడు అనుకోకుండా డ్రగ్స్ మాఫియాలో చేరతారు. అనతికాలంలోనే ఎంతో మందిని చంపేసి పెద్ద గ్యాంగ్ స్టార్ గా మారి.. రాజకీయ నాయకుల కోసం కోట్ల రూపాయలు వసూలు చేస్తుంటారు. అయితే ఈ గ్యాంగ్ స్టర్స్ పనులలో ప్రాస్టిట్యూషన్ కూడా ఒక భాగంగా ఉంటుంది. ఈ మాఫియా చేతికి చిక్కి స్నేహ కూడా ప్రాస్టిట్యూషన్ వృత్తిలో మగ్గిపోతుంటారు.



ఐతే మొదటి చూపులోనే ధనుష్ ఆమెపై మనసు పారేసుకుంటారు. తర్వాత ఆమెకి శారీరకంగా దగ్గరవుతారు. అలా వారి పరిచయం ప్రేమ వరకు వెళ్తుంది. ఒక రోజు ఆమె బాధలు తెలుసుకున్న అతను ఈ వృత్తి నుంచి ఆమెను విడిపించాలని అనుకుంటాడు. కానీ మాఫియా లీడర్ అందుకు ఒప్పుకోరు సరికదా స్నేహ ని విచక్షణ రహితంగా కొట్టి ధనుష్ ని ఇంకా బాధ పెడతాడు. దీంతో కోపోద్రిక్తుడైన ధనుష్ మాఫియా లీడర్ ని లేపేసి.. స్నేహా ని పడుపు వృత్తి నుంచి రక్షిస్తారు. అనంతరం పెళ్లి చేసుకొని ఆమె బిడ్డకు తండ్రి కూడా అవుతారు. కానీ చివరికి గ్యాంగ్ స్టర్ గొడలలో స్నేహ చనిపోతుంది.



అయితే ఆద్యంతం చాలా ట్విస్ట్ లతో కొనసాగే ఈ సినిమాలో ధనుష్ చాలా బాగా నటించారు. ధనుష్ సరసన స్నేహ కూడా అద్భుతంగా నటించారు. ఒక వేశ్యగా ఆమె కనపరిచిన సహజమైన నటనా చాతుర్యానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. భావోద్వేగమైన సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా స్నేహ సాలిడ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: