సినిమా వాళ్ళ పెళ్ళిళ్ళు అంటే జనాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది..  వాళ్ళ పెళ్ళిళ్ళు కొత్తగా ఉంటాయి.. ఒక్కో ప్రాంతం లోని వాళ్ళు ఒక్కో విధంగా పెళ్ళి చేసుకుంటారు.. అదే జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. వారి డ్రెస్సులు, మేకప్ తదితర అంశాలు ఆసక్తిని కలిగిస్తాయి.. ఈ మధ్య సినీ భామల పెళ్ళిళ్ళు జనాలను ఆసక్తి లో పడేస్తున్నాయి. ఎందుకంటే జనాలకు సడెన్ సర్ ప్రైజ్ చేస్తున్నారు.


పెళ్లికి ముందు పెద్దగా సందడి లేకపోయినా.. పెళ్లి తరువాత మాత్రం చాలా రోజులు మాట్లాడుకునేలా చేస్తున్నారు ఈ బ్యూటీస్‌. లేటెస్ట్ సెన్సేషన్ యామీ గౌతమ్ పెళ్లి కూడా ఇప్పుడు వార్తల్లో హల్ చల్ చేస్తుంది. ఈ అమ్మడు సడెన్ షాక్ ఇవ్వడం తో పాటుగా పెళ్ళి కి ఆమె వేసుకున్న డ్రెస్  గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.  అంత పెద్ద సెలెబ్రిటీ అయిన కూడా ఎ డిజైనర్ ను ఆమె సంప్రదించలేదు..33 ఏళ్ల క్రితం తన తల్లి కట్టుకున్న అదే పెళ్లిచీరను తన పెళ్లిలోనూ కట్టుకున్నారట ఈ బ్యూటీ..


మరో విషయమేంటంటే.. ఆమె వేసుకున్న నగలు కూడా అప్పటివే కావడం విశేషం.. కేవలం హిందీ భామ లే కాదు.. తెలుగు భామలు కూడా వారికి అమ్మ పై ఉన్న ప్రేమను చాటుకున్నారు.మెగా డాటర్‌ నీహారిక తన పెళ్లికి అమ్మ చీరనే కట్టుకున్నారు. అయితే యాజిటీజ్‌గా కాకుండా కొద్దిగా గ్రాండ్ కనిపించేలా వర్క్ చేయించుకొని ఈనాటి ట్రెండ్ కు తగినట్లు తయారు అయ్యింది. కపూర్ ఫ్యామిలీ గర్ల్స్ కూడా తమ పెళ్లి వేడుకల కోసం ఇలాంటి చాయిసే తీసుకున్నారు. ఇటీవల పెళ్ళి కూతురు అయిన సొనమ్ కపూర్ కూడా తల్లి చీర కట్టుకొని అభిమానుల ను ఆకట్టుకుంటుంది.. పెద్ద సెలెబ్రిటీలు అంతా ఇలా పాత కాలం ట్రెండ్ ను ఎంచుకోవటంతో ఫ్యాన్స్‌ కూడా అలానే చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: