తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో ఓ వెలుగు వెలిగిన డైరెక్ట్ శ్రీను వైట్ల. ఆయన తనదైన శైలిలో సినిమాలో తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం దూకుడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే ఎన్టీఆర్ తో చిత్రీకరించిన బాద్ షా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు శ్రీనువైట్ల. ఆ తరువాత వచ్చిన ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లు అయ్యాయి.

ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల మంచు విష్ణుతో డి అండ్ డి సినిమాను చిత్రీకరించడానికి రెడీ అవుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో మూడు కథలు సిద్ధం చేశానని ఆయన అన్నారు. ఇక త్వరలోనే డి అండ్ డి షూటింగ్ ప్రారంభం కానుందని శ్రీనువైట్ల వెల్లడించారు. అయితే డి అండ్ డి సినిమాకు ఢీ సినిమాతో చిన్న కనెక్షన్ ఉంటుందని అన్నారు. అయితే  ప్రస్తుతం వెండితెర లక్ష్యంగానే సినిమాలను చిత్రీకరిస్తున్నారని శ్రీనువైట్ల తెలిపారు. అంతేకాదు.. వెబ్ సిరీస్ లు చేయాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ రాలేదని శ్రీనువైట్ల అన్నారు.

కాగా.. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ ఫ్లాప్ కావడం గురించి మాట్లాడుతూ.. టైమింగ్ కు తగ్గ కథలు అందించలేదని అందువల్లే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని అన్నారు. ఇక ఇప్పటివరకు తాను ఏ సినిమాను రీమేక్ చేయలేదని ఆసక్తికరమైన స్క్రిప్ట్ అనిపిస్తే మాత్రం భవిష్యత్తులో రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అయితే మంచి సినిమా, వినోదాత్మకంగా ఉండే సినిమా చేయాలని అనుకుంటున్నానే తప్ప చిన్న సినిమా, పెద్ద సినిమా అనే ఆలోచనలు లేవని శ్రీనువైట్ల తెలిపారు. ఇక ట్రెండ్ మారిపోయిందని భావించి చేసిన పొరపాట్ల వల్లే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని శ్రీనువైట్ల అన్నారు. అయితే డి అండ్ డి సినిమాతో సక్సెస్ సాధించి కథల విషయంలో చేసిన తప్పులను శ్రీనువైట్ల సరిదిద్దుకుంటారో లేదో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: