![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/vadde-naveen66187bdf-ac6c-40ef-8f91-c2c129e1621e-415x250.jpg)
ఆ తరహా చిత్రాలకు ఎక్కువగా చేశారు నవీన్. అప్పట్లో పెళ్లి చిత్రం వడ్డే నవీన్ కి చాలా పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది. ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా ఆ తర్వాత ఆయనకు పెద్దగా అవకాశాలు రాకపోవడం , వచ్చినా అవి ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడం వల్ల చాలా రోజుల క్రితమే నవీన్ సినిమాలకు దూరమయ్యారు. ఆయన కథలు ఎంపిక ఓ రకంగా కారణం అయితే మరో కారణం ఆయన పెళ్లి చేసుకోవడం. ఆయన నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి రామకృష్ణ కూతుర్ని వివాహం చేసుకోగా ఆ తర్వాత వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడం తో విడాకులు తీసుకున్నారు. ఆ కోపంతోనే నందమూరి కుటుంబం ఆయనకు అవకాశం లేకుండా చేసిందని చెబుతారు.
ఆ తరువాత వడ్డే నవీన్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు అయితే ఎప్పుడు చేసుకున్నారు ఆమె భార్య ఎలా ఉంటుంది అనే విషయాలు అయితే బయటకు రాలేదు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం వల్ల వడ్డే నవీన్ ఫ్యామిలీ ఎవరికీ పెద్దగా తెలియదు. తాజాగా వడ్డే నవీన్ భార్య పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వడ్డే నవీన్ కూతురు చాలా అందంగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అలాగే నవీన్ కొడుకు ధోవతి ఫంక్షన్ లో నటి మరియు ఎమ్మెల్యే రోజా తో దిగిన ఫోటోలు షేర్ చేయడంతో ఈ కుటుంబం ఫోటోలు బయటకు వచ్చాయి. ఒక్కసారిగా వడ్డే నవీన్ కుటుంబం ఫొటోస్ చూసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.