అంతేకాదు సినిమా పోస్టర్ రీ ట్వీట్స్, లైక్స్ అన్ని రికార్డులు కొల్లగొట్టేలా ఉన్నారు. విజయ్ సినిమా అంటే ఆ మాత్రం హడావిడి ఉండాల్సిందే. అందుకే దళపతి ఫ్యాన్స్ హంగామా మొదలు పెట్టారు. బీస్ట్ సినిమాలో ఫస్ట్ లుక్ తోనే గన్ను పట్టించాడు అంటే డైరక్టర్ నెల్సన్ విజయ్ తో ఓ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడని అర్ధమవుతుంది. తప్పకుండా విజయ్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండేలా చేస్తాడని చెప్పొచ్చు.
రీసెంట్ గా మాస్టర్ తో హిట్ అందుకున్న విజయ్ బీస్ట్ తో అంతకుమించి హిట్ అందుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్దే నటిస్తుంది. తమిళంలో ఆరేళ్ల తర్వాత అమ్మడు మళ్లీ ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తుంది. తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న అమ్మడు ఇప్పుడు తమిళ పరిశ్రమను ఏలేందుకు వెళ్తుంది. అక్కడ కూడా పూజాకు వరుస అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తుంది.