ప్రస్తుతం ఆయన సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న సిటీ మార్ సినిమా చిత్రం పైనే ఆశలు పెట్టుకున్నారు. గోపీచంద్ అభిమానులు ఈ సినిమా తప్పకుండా హిట్ అయి మళ్లీ ఆయనను ఫామ్ లోకి తీసుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కబడ్డీ ఆట నేపథ్యంలో సాగుతోంది. ఇకపోతే గోపీచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే మరొక సినిమాను కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మారుతి సినిమాలంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు. అలాంటి ఓ మంచి కాన్సెప్ట్ గోపీచంద్ కు సెట్ చేశాడట మారుతి. ఈ సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు గోపీచంద్ ఫాన్స్.
అలాగే గోపీచంద్ నటించి ఆగిపోయిన సినిమా ఆరడుగుల బుల్లెట్. ఈ సినిమా మళ్ళీ విడుదలకు సిద్ధంగా అవుతోందట. మంచి కథతో తెరకెక్కిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల ఆగిపోయింది. అయితే గోపీచంద్ ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమా నిర్మాత ఈ సినిమాను విడుదల చేయడానికి చాలా ప్రయత్నాలు చేయగా ఇప్పుడు దానికి ముహూర్తం దొరికింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా గోపీచంద్ కి మంచి పేరు తెచ్చి పెడుతుందని అంటున్నారు. ఈ మూడు సినిమాలు కూడా ఈ సంవత్సరమే రిలీజ్ అవుతుండటంతో గోపీచంద్ ఫ్యాన్స్ లో ఆనందం అవధులు లేకుండా పోయింది. సంవత్సరానికి ఒక్క సినిమా చేయడమే గగనమై పోయినా ఈ టైంలో మూడు సినిమాలు అనుకోకుండా రిలీజ్ అవ్వడం అభిమానులకు పండగ లాంటి న్యూస్ అని చెప్పాలి. ఇప్పటికే వరుస ప్లాపులతో ఉన్న గోపీచంద్ ఈ మూడు సినిమాలలో ఏ రెండు సినిమాలు హిట్ కొట్టిన మళ్లీ ఆయనకు పూర్వవైభవం రావడం గ్యారంటీ అంటున్నారు. మరి గోపీచంద్ కి ఈ మూడు సినిమాలలో ఏ సినిమా హిట్ ఇస్తుందో చూడాలి.