తాజాగా విడుదలయిన రెండో సీజన్ కూడా అంచనాలను అందుకోవడంతో పాటు ఆడియన్స్ను ఫిదా చేసింది. ఈ సీజన్ తాజాగా ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టడంతో సమంత ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్లో రాజీ పాత్రలో సూసైడ్ బాంబర్గా సమంత జీవించింది. ఎంతలా సమంత మాయ చేసిందంటే తొలి సీజన్ లో నటించిన మనోజ్ బాజ్పాయ్ ఈ సీజన్లో కూడా ఉన్నా... అతడిని డామినేషన్ చేసింది సమంత.
అంతే కాకుండా సీనియర్ నటి ప్రియమణి ఉన్నా కూడా సమంత క్రేజ్తోనే ఈ సిరీస్ను పబ్లిసిటీ చేశారు. అంటేనే అర్థం చేసుకోవచ్చు.. సిరీస్పై సమంత ప్రభావం ఎంతలా ఉందో.. ఈ సిరీస్ ఫలితంతో అందరూ సమంతను మెచ్చుకుంటున్నారు. తాను ప్రదర్శించిన ధైర్యం, తెగువ ఎంతో గొప్పవని మెచ్చుకుంటున్నారు. ఈ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న సమంత మరో వెబ్ సిరీస్ కు కూడా పచ్చ జెండా ఊపిందని ఫిల్మ్ నగర్ టాక్. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫాంలో ఈ చిత్రం ప్రసారం కానుందని పలువురు చర్చించుకుంటున్నారు. తన కెరీయర్లో మొదటిసారిగా కుందనపు బొమ్మ సమంత ఈ సిరీస్లో బోల్డ్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. ఈ వెబ్సిరీస్ విడుదలకు ముందు తమిళులు గొడవ చేసినప్పటికీ నిర్మాతలు అనుకున్న విధంగానే ఈ వెబ్సిరీస్ ను విడుదల చేయడం గమనార్హం. ఈ సిరీస్ ఇంతలా హిట్ కావడానికి ఒక కారణం సమంత అనేది ఎవరూ కాదనలేని వాస్తవం..