టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్..తాజాగా తనకు సంబంధించిన ఓ ప్రాపర్టీ ని అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి.. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్.. తనతో కలిసి నటించిన జీవిత ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే రాజశేఖర్ ఒకప్పటి తన ఇమేజ్ ని కాపాడుకోలేకపోయాడు. తన తోటి హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలయ్య, నాగార్జున..పలువురు హీరోలు మాత్రం ప్రస్తుతం అదే ఇమేజ్ తో సీనియర్ హీరోలుగా కొనసాగుతున్నారు. కానీ రాజశేఖర్ విషయంలో అది జరగలేదు.

అయితే తాజాగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని రాజశేఖర్ కి 200 కోట్లు విలువ గల ఆస్తులు ఉన్నట్లు సమాచారం.అయితే ఇన్నాళ్లు వాటిని లీజ్ కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.అయితే తాజాగా ఆ భూములపై మెగా వారి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన కన్ను పడిందట.అంతేకాదు ఆ భూములను ఎంత రేటుకైనా కొనడానికి ఉపాసన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.అయితే ఈ ఆస్తుల్లో రాజశేఖర్ తో పాటూ ఫీనిక్స్ గ్రూపు మెంబర్స్ కి కూడా వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారు కూడా ఈ ఆస్తులను మంచి రేటుకు అమ్మాలని చూస్తున్నారట.ప్రస్తుతానికి ఆ భూములలో కొంతమంది అద్దెకు ఉంటున్నారని.. వీళ్ళ యొక్క లీజు ఒప్పందాలపై ఈ క్రయ, విక్రయాలు ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ వెంచర్ పక్కనే ఫీనిక్స్ గ్రూప్ మరో కొత్త వెంచర్ ని నిర్మించగా..ఆ వెంచర్ లో హారిక హాసిని నిర్మాణ సంస్థ అధినేత చినబాబు, టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ లాంటి ప్రముఖులు భూములు కొన్నట్లు సమాచారం.ఇక ప్రస్తుతం ఆ భూముల్లో అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయించి.. ఈ డీల్ ను పూర్తి చేయాలని అనుకుంటున్నారట. అంతేకాదు ఈ భూములతో పాటుగా విప్రో సర్కిల్స్ ఏరియాలో ఉన్న మరో ప్రాపర్టీ ని సైతం అమ్మాలని జీవితా రాజశేఖర్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఇలా ఉన్నట్టుండి రాజశేఖర్ తన ఓన్ ప్రాపర్టీస్ ని అమ్మడానికి గల కారణాలు ఏంటో మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: