ఇప్పుడు మహేష్ సినిమా కోసం ఏకంగా పవన్ కెమియో ఒకటి ప్లాన్ చేస్తున్నారట. పవన్, మహేష్ ఒకే స్క్రీన్ పై కనబడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో పవన్ ఓ సర్ ప్రైజ్ రోల్ లో కనిపిస్తారని టాక్. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ సీక్రెట్ గా ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ను పిలిచి ఆ టైం లో తన పాత్ర గురించి లీక్ చేస్తారని అనుకుంటున్నారట.
అదే జరిగితే త్రివిక్రం, మహేష్ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడు మహేష్. ఆ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలిసిందే. జక్కన్నతో మహేష్ సినిమా నెక్స్ట్ లెవల్ లో ప్లాన్ చేస్తున్నారు. మహేష్, రాజమౌళి కలిసి చేస్తున్న సినిమా కథాంశం ఏంటన్నది ఇప్పటివరకు బయటకు రాలేదు. త్రివిక్రం, రాజమౌళి మహేష్ సినిమాల లైనప్ తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న మహేష్ ఈ సినిమాలతో మళ్లీ రికార్డులు సృష్టించాలని చూస్తున్నాడు.