తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి మంచి పాత్రలు పోషిస్తూ , ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ప్రేక్షకులలో తమకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక అంతే కాదు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు బాగా చేరువలో ఉంటూ, అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఎవరైనా ఉన్నారంటే వారు సురేఖవాణి, హేమ, ప్రగతి, పవిత్ర లోకేష్. వీరు అటు సినిమాలలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ప్రేక్షకులకు బాగా చేరువలో ఉన్నారు. అయితే వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు.. వారి లైఫ్ స్టైల్  ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


1. సురేఖా వాణి:సినిమాలలో ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో అత్తగా, చెల్లిగా , అత్తగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖవాణి. ఇటీవల సోషల్ మీడియా ద్వారా తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది  ఇక అంతే కాదు తన కూతురును  కూడా బాగా పాపులర్ చేస్తోంది. ఇక ఈమె టీవీ సీరియల్ టాప్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. కానీ ఆయన స్వర్గస్తులవడంతో, కూతురు సుప్రీత తో కలిసి జీవిస్తోంది.

2. హేమ:


హేమ ఆంధ్రప్రదేశ్ లోని  కోస్తా ప్రాంతానికి చెందిన వారు. ఈమె అసలు పేరు కృష్ణవేణి. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో హీరోయిన్ కి స్నేహితురాలి పాత్రలో చేసి, ఆ తర్వాత బ్రహ్మానందం గారికి జోడీగా నటించి, నవ్వులు పూయించింది. ఇక ఈమె కెమెరామెన్ జాన్ అహమ్మద్ ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈమె కూడా తన కూతురి ఈషా తో కలసి వీడియోలు చేస్తూ, సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తోంది.

3. ప్రగతి:ప్రగతి బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చింది. తల్లి పాత్రలో ఎక్కువగా నటించి అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తోంది. ప్రగతి సినిమాలలో మామూలుగా కనిపించినా, రియల్ లైఫ్ లో మాత్రం కొత్త కొత్త లుక్ లతో, హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ , జిమ్ వర్కౌట్లు చేస్తూ సోషల్ మీడియా లో  హల్ చల్ చేస్తోంది.

4. పవిత్ర లోకేష్:పవిత్ర లోకేష్ కర్ణాటకకు చెందిన వారు. ఇక ప్రస్తుతం తెలుగులో తల్లి పాత్రలు చేస్తూ , మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కన్నడ నటుడు సుశీంద్రన్ పెళ్లి చేసుకొని అతనితో జీవనం సాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: