మెగాస్టార్ చిరంజీవి, కొరటాల  శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ ఆచార్య. ఈ సినిమా పై చిరంజీవి అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన కొరటాల శివ సినిమాలలో ఒకటి కూడా డిజాస్టర్ కాలేదు. అందుకే చిరంజీవి లాంటి స్టార్ హీరో కథ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. అయితే ఇటీవల ఆచార్య సినిమాకి సంభదించిన ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి బయటికి వచ్చింది.. అది ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా మొదట బిజినెస్ బాగానే జరుగుతుండగా, సడన్ గా రామ్ చరణ్ ఎంట్రీ తో బిజినెస్ (150 కోట్లు)రెండింతలు పెరిగింది. ఇక అసలు విషయంలోకి వస్తే, నిజానికి ఈ సినిమాలో మొదట రామ్ చరణ్ నటిస్తున్న పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు ని అడిగారట. అందులో అప్పుడు రామ్ చరణ్ RRR షూటింగ్లో బిజీగా ఉండడం తో, మొదట సూపర్ స్టార్ నే నటింపజేయాలని అనుకున్నారు.


డైరెక్టర్ కొరటాల శివ గారు మహేష్ బాబుకి కథ కూడా వినిపించారు. ఆయనకి కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట.కచ్చితంగా చేస్తానని మాట కూడా ఇచ్చాడట. కానీ కరోనా ఉద్రిక్తత ఎక్కువగా  ఉండడంతో లాక్ డౌన్ విధించడంతో కూడా జరిగింది. అప్పుడేమో అలా అన్ని సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. ఇక అంతకుముందు డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఈ సినిమా కి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు మహేష్ బాబు. ఇలా ఆయన ఈ సినిమాలో నటించ లేకపోయాడు.


RRR షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ ను ఆచార్య సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాలని రాజమౌళి గారిని అడగారు చిరంజీవి గారు. ఆయన నటించడానికి రామ్ చరణ్ కు అవకాశం ఇచ్చారు. అలా షూటింగ్ షర్టు తో వెళ్ళిన రామ్ చరణ్ కొరటాల శివ తో ఒక ఫోటో ని తన ట్విట్టర్ లో అప్లోడ్ చేశారు. అందులో రామ్ చరణ్ లుక్స్ ను  చూసి అభిమానులు ఎంతో సంబర పడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: