నందమూరి
బాలకృష్ణ తల్లిదండ్రు ల స్మారకార్థం ఎంతో ప్రతిష్టాత్మకంగా నడిపస్తున్న సంస్థ బసవతారకం హాస్పిటల్. ఎంతోమంది పేద ప్రజలను ఆదుకుంటూ డబ్బు లేకుండా చికిత్స అందిస్తూ వారి ఆదరాభిమానాలను పొందుతున్నారు బాలకృష్ణ. హీరోగా ఎన్నో మైలురాయి లను అందుకున్న
బాలకృష్ణ ఈ సంస్థను చేపట్టి ప్రజలకు చేరువ చేయడంలో విజయవంతమయ్యారని చెప్పొచ్చు. ఇటీవలే ఈ సంస్థ ప్రారంభించి 21 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో
బాలకృష్ణ ఎమోషనల్ గా ఆసుపత్రి విషయాలు చెప్పారు.
ఈ ఆసుపత్రిని తమ తల్లి బసవతారకం పేరిట తమ
తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు స్థాపించారని ఎంతోమంది గొప్ప దాతల సహకారంతో తన
తండ్రి ఆశయం నిర్విఘ్నంగా కొనసాగుతుందని చెప్పారు.
భారత్ లో ఉన్న అత్యుత్తమ
క్యాన్సర్ ఆస్పత్రిలో బసవతారకం
క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి అని గర్వంగా చెప్పారు.
కరోనా సంక్షోభ సమయంలో
క్యాన్సర్ రోగులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏదేమైనా నందమూరి
బాలకృష్ణ హీరోగా నే కాకుండా సమాజ
సేవ చేయడం లోనూ తనదైన ముద్ర ను చూపిస్తున్నారు.
ఇకపోతే ఆయన హీరోగా నటిస్తున్న అఖండ చిత్రం త్వరలో నే థియేటర్ల లో విడుదల కానుంది.
మాస్ చిత్రా ల దర్శకు డు
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రగ్య
జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా రెండు డిఫరెంట్ గెటప్ లో
బాలకృష్ణ కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ
సినిమా నుంచి వచ్చిన టీజర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే గా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. ఈ
సినిమా తర్వాత
బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్
సినిమా చేయబోతున్నారు. తన సినిమాల లాగే ప్రజలు బాగుండాలని చేసే
సేవ కూడా ఎంతో విజయవంతం అవ్వాలని కోరుకుందాం.