మామూలు తెలుగు సినిమాలు బాగా సెంటిమెంట్ ను పండిస్తాయి. జనాల ఫీలింగ్స్ ను క్యాచ్ చేసుకోవడంతో సినిమాలు ఇప్పుడు భారీ హిట్ టాక్ అందుకున్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ కూడా రొమాన్స్ కు కేరాఫ్ గా మారుతున్నాయి. దాంతో సినిమాలు కొంతవరకు మాత్రమే మంచి టాక్ ను అందుకుంటున్నాయి. ప్రస్తుతం సినిమాలకన్నా ఎక్కువ గా వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుంది. సమంత లాంటి పాపులర్ హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ ల వైపు మొగ్గుచూపుతున్నారు.


దీంతో వీటిని మార్కెట్ లో డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. దర్శకులు కూడా జనాల ను ఆకట్టుకోవాలని కొత్తగా కథను అల్లే ప్రయత్నం చేస్తున్నారు. విషయం లోకి వస్తే నందినీరాయ్‌ నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ 'ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌'. 'ఆహా' ఓటీటీలో ఈ వెబ్‌ సిరీస్‌ ప్రసారం అవుతోంది.. ఈ షూటింగ్ లో కడుపుబ్బా నవ్వుకున్న సన్నివేశాలు అంటూ నందినిరాయ్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసింది. ఈ వీడియో లో పోసాని చనిపోయినట్లుగా చూపిస్తూ.. భౌతికకాయంతో పాటు.. పక్కన ఫొటోకి దండలు వేసినట్లు కనిపిస్తున్నాయి.


కాగా, పక్కనే ధనుష్‌ 'జగమే తందిరమ్‌' చిత్రం లోని ఓ మాస్ పాట కు నందినీరాయ్ అదిరిపోయే స్టెప్పులు వేస్తుంది. 'జగమే తందిరమ్‌' సినిమా లో కూడా ఈ బీట్‌.. ధనుష్‌ కి ఎంతో ఇష్టమైన మురగేషన్‌ అనే పాత్ర చనిపోయినప్పుడు వస్తుంది. నందనీరాయ్ కూడా అలానే చేయడం తో ఈ సీన్ కామెడీని పండిస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. నెటిజన్లు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ విడుదయ్యి చాలా రోజులు అయిన కూడా క్రేజ్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు.. ప్రస్తుతం తెలుగులో సినిమాల కన్నా కూడా ఈ వెబ్ సిరీస్ లు ఎక్కువయ్యాయి. స్టార్ లు అందరు కూడా అటువైపే ఆసక్తి చూపిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: