
ఇలా అటువైపు మంచు విష్ణు, రాజ్ తరుణ్ ఇద్దరూ సాలిడ్ హిట్ కొట్టేందుకు స్ట్రాంగ్ గా ట్రై చేస్తున్నారు. అయితే గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన "ఆడోరకం ఈడోరకం" మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరు స్క్రీన్ షేర్ చేసుకొని ఎలాగైనా సక్సెస్ పొంది తెలుగు హిట్ ట్రాక్ ఎక్కాలని అనుకుంటున్నారట. అందులోనూ ఇదే సినిమా డైరెక్టర్ తోనే మళ్ళీ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఒక మంచి కామెడీ సబ్జెక్టు వీరికి వినిపించారని వినికిడి. ఆ కథకు వీరిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో నాగేశ్వర్ రెడ్డిది ప్రత్యేక శైలి అని చెప్పవచ్చు. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్టైన్మెంటే ఫుల్ గా ఉంటుందని సమాచారం. గతంలో ఈ న్యూస్ పై కాస్త గుసగుసలు వినిపించగా, ఇప్పుడు దాదాపుగా వీరి కాంబినేషన్ లో ఫిల్మ్ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ సినీ వర్గాల నుండి సమాచారం. అతి త్వరలోనే యంగ్ హీరోలు ఇద్దరూ కలసి సిల్వర్ స్క్రీన్ పై మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.