నటి కస్తూరి శంకర్ అంటే ఎవరికి తెలియకపోవచ్చు.. కానీ ఈమె"గృహాలక్ష్మి" సీరియల్ లో తులసి అనే పాత్రలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇలా బుల్లితెరకు దగ్గరైన కస్తూరి, ఈమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. అంతేకాకుండా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఈమే చెప్పే సమాధానాలు అందరిని బాగా ఆకట్టుకుంటాయి. ఈమె లాయర్ అవ్వడం చేత సమాజంలో జరుగుతున్న సామాజిక అంశాల మీద పట్టు ఉండడంతో ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో వెళ్లాలని సూచిస్తూ ఉంటుంది.
ఇటీవల రజనీకాంత్ ఆరోగ్యంపై కొంతమంది కొన్ని రకాలుగా చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈమె కూడా రజినీకాంత్ గారి ఆరోగ్యంపై విశ్లేషిస్తూ ఇలా అంది."ఎన్నారైలను మే నెల నుంచి అమెరికాకు వెళ్లనివ్వడం లేదు.USA మన మీద నిషేధం విధించింది. హెల్త్ పరంగా కూడా ఎవరిని అక్కడకు రానివ్వలేదు. ఇలాంటి సమయంలో రజినీకాంత్ అక్కడికి ఎలా వెళ్లారు..? అసలు ఎందుకు వెళ్లారు..?ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు కూడా అప్పట్లో ప్రచారం చేశారు.. మరి ఇప్పుడేమో ఇలా ఇదంతా ఏదో కన్ఫ్యూజన్ గా ఉంది అంటూ.. వీటన్నిటికి ఒక క్లారిటీ ఇస్తే సరిపోతుందని.." రజినీకాంత్ ని అడిగింది.
NRI లు అక్కడుండే వారిని, అక్కడ పని చేసే వారిని మాత్రమే ఇండియా నుంచి వెళ్లే వారిని వాళ్ల దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రజినీకాంత్ ను వాళ్ళు ఎలా రాణిస్తారు. రజినీకాంత్ ప్రయాణం ఒక మిస్టరీ. రజినీకాంత్ భారత ప్రభుత్వం అనుమతి తీసుకొని వైద్యం కోసం అక్కడికి వెళ్లారు అని కొంతమంది చెబుతున్నారు. కానీ ఆయన ఆరోగ్య సమస్య ఏంటి? ఆయనకు ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్స్ ఇక్కడ లేవా? అని తన ట్విట్టర్ లో ఈ పోస్టు పెట్టింది.
ఇదిలా ఉండగా రజనీ కాంత్ గారికి రూల్స్ లేవా అని తెలిపింది.ఇలాంటి వారే రూల్స్ బ్రేక్ చేస్తే ఎలా అని స్పందించింది.ఇలాంటి పరిస్థితుల్లో ఆయనని ఇతర దేశాలకు ఎలా పంపిస్తారు. అంటూ కామెంట్ చేసింది కస్తూరి."అయితే ఇది రజినీకాంత్ ఒక్కరే అని కాదు మరి ఇంకొకరైనా సరే" అంటూ ట్విట్టర్లో తెలిపింది.