సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణ తెలుగు సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించటేదు. ఇక్కడ సినిమాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు ఇప్పుడు తెలుగులో సినిమా అంటే చాలు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుంది. తమిళంలోనే వరుస సినిమాలు చేస్తున్న త్రిష తెలుగులో ఆఫర్లు వస్తున్నా సరే చేసేందుకు ఆసక్తి చూపించట్లేదు.

మెగస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో కాజల్ కు ముందు అనుకున్న హీరోయిన్ త్రిషనే. కాని ఆమె ఎందుకో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఇక లేటెస్ట్ గా అనీల్ రావిపుడి డైరక్షన్ లో త్రిష హీరోయిన్ గా ఓ ఫీమేల్ సెంట్రిక్ మూవీ తీయాలని అనుకున్నారు. కాని త్రిష ఈ సినిమాకు నో చెప్పిందని తెలుస్తుంది. త్రిష కాదనడంతో ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాడు అనీల్ రవిపుడి.

తను రాసుకున్న కథకు త్రిష అయితే పర్ఫెక్ట్ అనుకున్నాడు అనీల్ రావిపుడి. ఇంతకీ త్రిష తెలుగు సినిమాలు ఎందుకు ఓకే చేయట్లేదు అన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్ అయ్యింది. తెలుగు స్టార్ హీరోతో ఆమె క్లోజ్ గా తిరిగింది అన్న రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ హీరోకి పెళ్లి కూడా అయ్యింది. ఒకవేళ ఆమె తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణం అదే అయ్యుంటుందా అని అనుకుంటున్నారు.

తెలుగులో వస్తున్న ప్రతి ఆఫర్ ను ఏదో ఒక రీజన్ చెప్పి మిస్ చేసుకుంటుంది త్రిష. అటు తమిళంలో మాత్రం సినిమాలు చేస్తుంది. తెలుగులో ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈమధ్య కాలంలో త్రిష తెలుగులో చేసిన సినిమాలేవి పెద్దగా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలను కూడా కాదని చెప్పింది అంటే అమ్మడు మనసులో ఏదో బలమైన రీజన్ ఉండి ఉంటుందని అంటున్నారు. మరి త్రిష ఫ్యూచర్ లో అయినా త్రిష తెలుగు సినిమాలు చేస్తుందా లేక పర్మినెంట్ గా గుడ్ బై చెప్పిందా అన్నది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: