తొలివలపు చిత్రం తో రొమాంటిక్ హీరోగా వెండితెరకు పరిచయం అయిన గోపీచంద్ ఆ తర్వాత జయం సినిమాతో ప్రతి నాయకుడిగా మారి షాక్ ఇచ్చారు. నిజం, వర్షం సినిమాల్లో ఆయన పెర్ఫార్మన్స్ కి సినిమా విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఆ తర్వాత మళ్లీ హీరోగా నటించడం ప్రారంభించారు. ఆయన 2004 నుంచి 2010 వరకు యాక్షన్ సినిమాలు చేశారు. 2011 వ సంవత్సరంలో కూడా వాంటెడ్ అనే ఒక యాక్షన్ సినిమాలో హీరోగా నటించారు. అయితే అదే సంవత్సరంలో ఆయన నిన్నే పెళ్ళాడతా, మురారి వంటి ఓ ఫ్యామిలీ డ్రామాలో హీరోగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.



2011 వరకు ఆయన ప్రతి సినిమాలో భారీ డైలాగులు చెబుతూ, రౌడీలను కత్తులతో నరుకుతూ కనిపించారు కానీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ డ్రామా లో ఆయన నటించలేదు. దీనితో ఇక గోపీచంద్ యాక్షన్ హీరోగా మిగిలిపోతారని అందరూ అనుకున్నారు కానీ ఆయన మొగుడు సినిమాతో తాను కూడా ఫ్యామిలీ హీరోగా నటించి మెప్పించగలనని నిరూపించారు. దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమాలో కుటుంబ సభ్యుల మధ్య ఉండే స్నేహం, బాధ్యత, ప్రేమ, ఆప్యాయతలను చాలా చక్కగా చూపించారు. అందుకే ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అలరించింది. తన మాస్ ఇమేజ్ ని పక్కన పెట్టి.. బాధ్యత గల కుటుంబ సభ్యుడిగా గోపీచంద్ చాలా బాగా నటించారు.



సినిమా క్లైమాక్స్ లో ఎమోషనల్ సన్నివేశాల్లో గోపీచంద్ చూపించిన నటనా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. గోపీచంద్, తాప్సీ రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. "కావాలి కావాలి" పాటలో గోపీచంద్ సూపర్ రొమాంటిక్ బాయ్‌గా మారిపోయారనే చెప్పాలి. ఈ చిత్రం తర్వాత ఫ్యామిలీ హీరోగా గోపీచంద్ మారిపోయారు. ఆయన రీసెంట్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ.. ఆ మూవీస్ అన్ని కూడా ఫ్యామిలీ జానర్ కోవలోకే వస్తాయి. గోపీచంద్ థ్రిల్లర్ సినిమాలు కూడా చేస్తూ ఆడియన్స్ ని అల్లరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: