నాగచైతన్య హీరోగా నటిస్తున్న లవ్ స్టోరీ, అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నాగశౌర్య "లక్ష్య", అమలాపాల్ "కుడిఎడమైతే" సినిమాలు త్వరలోనే ఆహా ఓటీటీ వేదికగా విడుదల కానున్నాయని సమాచారం. 4 తెలుగు సినిమాలను నేరుగా ఒకే ఓటీటీ ప్లాట్ ఫామ్ విడుదల చేయడం ఇదే మొదటి సారి అని చెప్పుకోవచ్చు. మిగతా స్ట్రీమింగ్ సంస్థలు మహా అంటే నెలకు ఒకటి లేదా రెండు తెలుగు సినిమాలు విడుదల చేస్తున్నాయి. తెలుగు సినిమాలను నేరుగా రిలీజ్ చేయడంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ముందు వరుసలో ఉంటుంది. భారీ డీల్స్ ఆఫర్ చేస్తూ రీజనల్ లాంగ్వేజెస్ లో తన సత్తా చాటాలని ప్రైమ్ వీడియో బాగా ప్రయత్నిస్తోంది. కానీ దానికి ధీటుగా నిలవడానికి ఆహా దూకుడుగా వ్యవహరిస్తోంది.
తెలుగు భాషలో ఎక్స్ క్లూజివ్ వెబ్ సిరీస్ లు, సరికొత్త సినిమాలను విడుదల చేయడంలో ఆహా భారీ నిర్ణయాలు తీసుకోవడం ప్రైమ్ వీడియోకి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. ప్రైమ్ వీడియో లో తెలుగులో ఏం వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉన్నాయో చెప్పడం కూడా కష్టమే. కానీ ఆహాలో 11th అవర్, లాక్డ్, హనీ మూన్, అద్దం, మస్తీస్, సిన్, కొత్త పోరడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎక్స్ క్లూజివ్ వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. దీంతో తెలుగువారికి ఆహా అనేది ఫేవరెట్ ఓటీటీగా మారుతోంది. మరోపక్క అమెజాన్ ప్రైమ్ వీడియో పాపులారిటీ తగ్గిపోతోంది.