ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తోంది. లేటెస్ట్ ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. కొరటాల శివ ఆచార్య సినిమా కథను పదిహేను సంవత్సరాల క్రితమే పూర్తి చేశారట. ఈ కథతో ఒక భారీ సినిమా తీయాలని.. స్టార్ యాక్టర్ ని హీరోగా తీసుకోవాలని డైరెక్టర్ గా మారక ముందే కొరటాల శివ భావించారట. అయితే కొరటాల శివ 15 సంవత్సరాల తర్వాత ఈ కథను ఇటీవల చిరంజీవికి వినిపించగా ఆయన మరో ఆలోచన లేకుండా వెంటనే సినిమాకి ఓకే చెప్పేశారు.
చిరంజీవి తనతో కలిసి సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో.. కొరటాల శివ తన కథను మరింత పవర్ ఫుల్ గా మార్చారట. అలాగే రామ్ చరణ్ పాత్ర నిడివి 40 నిమిషాలు ఉండేలా కథ రాసుకున్నారట. అయితే ఈ సినిమాలో ‘ఒక్కఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్’ నటి సంగీత పాత్రతో ఒక హార్ట్ బ్రేకింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుందని ఇన్ సైడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రంలో ఆమె ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారని.. ఆ పాత్ర ముగింపు ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తుందని టాక్. విలన్ తో ఆమె చెప్పే డైలాగులు చాలా పవర్‌ఫుల్ గా ఉంటాయని కూడా సమాచారం.