ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య చిగురించిన స్నేహం కాస్త ప్రేమగా మారి వీరు పెళ్లి చేసుకున్నారు. 2005లో వీరి వివాహం జరుగగా... 2011లో ఈ దంపతులకు ఆజాద్ అనే బాబు సరోగసీ పద్ధతిలో జన్మించాడు. ఆమీర్ కిరణ్ రావును పెళ్లి చేసుకునేందుకు తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చాడు.
ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు ఎందుకు ? విడాకులు తీసుకున్నారు ? అసలేం జరిగిందన్నదే ఇప్పుడు చర్చగా మారింది. అయితే లోకనాయకుడు కమల్ - గౌతమి దంపతులు విపోడియిన కారణమే ఆమీర్ - కిరణ్ విషయంలోనూ రిపీట్ అయ్యిందని తెలుస్తోంది. కమల్ - గౌతమి సహజీవనం ప్రారంభించాక చివర్లో కమల్ కుమార్తెలు శృతీ హాసన్, అక్షరా హాసన్‌తో ఆయన ఎక్కువ సమయం గడుపుతూ వచ్చారు. కమల్ వారికి ప్రాధాన్యం పెంచడం.. అది గౌతమికి నచ్చకపోవడం జరిగింది. చివరకు అదే కారణంతో వీరిద్దరు విడిపోయారు.
ఇప్పుడు ఆమీర్ - కిరణ్ రావు అన్యోన్యంగా ఉన్న సమయంలో ఆమీర్ తన మొదటి భార్య రీనా పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం తోనే వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని తెలుస్తోంది. రీనా పిల్లలకు ప్రాధాన్యం విషయంలో హర్ట్ అయిన కిరణ్ రావు కొద్ది రోజుల నుంచి ఆమీర్‌కు దూరంగా ఉంటూ వస్తోందట. చివరకు ఈ గ్యాప్ వీరు విడిపోయే వరకు వచ్చేసింది.