తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి సౌందర్య. అగ్ర హీరోల సరసన సినిమాలు చేసిన ఈమె.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరువైంది.ముఖ్యంగా అందంతో పాటు నటనలో అప్పటి సావిత్రి గారి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంటే అది సౌందర్య అనే చెప్పాలి.అంతేకాదు నిజానికి కన్నడ పరిశ్రమకి చెందిన సౌందర్య.. అచ్చ తెలుగు అమ్మాయిలా టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకుంది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో నటించాలి అంటే కేవలం గ్లామర్ పాత్రలే చేయాలి అనే పద్ధతినే పూర్తిగా మార్చేసి..మీడియం రేంజ్ అలాగే చిన్న హీరోల పక్కన కూడా నటిస్తూ చాలామంది హీరోయిన్లకు ఆదర్శంగా నిలిచింది.

అందుకే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు సౌందర్యను ఆరాధిస్తారు.అయితే ఎవ్వరూ ఊహించని విధంగా 2004 వ సంవత్సరంలో దురదృష్టవశాత్తు ఓ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది సౌందర్య.ఇదిలా ఉంటె ఇప్పటికీ ఈమె గురించి ఎదో ఒక వార్త పలు మీడియాలలో ప్రచారం జరుగుతూనే ఉంటుంది. అప్పట్లో ఈమె ఆస్తి కొన్ని వందల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు పండితులు.ఈమె ఆస్తి విషయమై ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తోంది.ఎందుకంటే ఈమె ఆస్తిని ఈమె భర్త మాత్రమే అనుభవిస్తున్నాడని..సౌందర్య తల్లిదండ్రులకు రావాల్సిన వాటా కూడా ఇవ్వడంలేదని కోర్టులో కేసు నడుస్తోంది..నిజం చెప్పాలంటే సౌందర్య భర్త గురించి చాలామందికి తెలియదు.


సౌందర్య కి దగ్గరి బంధువైన ఇతని పేరు జి.ఎస్. రఘు.ఇతన్ని పెళ్లి చేసుకోవడం సౌందర్య తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేదు.అయినా కానీ తల్లిదండ్రుల మాట కాదని రఘుని పెళ్లి చేసుకుంది సౌందర్య. 2003లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక సౌందర్య భర్త రఘు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్.కొన్నాళ్ళు ఎంతో సంతోషంగా  కొనసాగిన వీరిద్దరి దాంపత్య జీవితంలో వీరికి సంతానం కలగలేదు.ఇక సౌందర్య మరణించిన కొంత కాలానికి అపూర్వ అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు రఘు.ప్రస్తుతం ఇతను తన కుటుంబంతో కలిసి గోవాలో స్థిరపడ్డాడని సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: