తెలుగు సినిమా పరిశ్రమలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు స్టైల్ ప్రత్యేకం. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడంలో మోహన్‌బాబును మించిన వారు ఉండరు. ఆయన ముక్కు సూటితనమే ఆయనకు ఎంతో మందిని శత్రువులను చేసింది. అయితే ఇదే ముక్కు సూటితనం.. ముక్కోపి తనం ఆయనకు వ్యక్తిగత జీవితంలో కూడా తీరని నష్టం కలిగించింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగుల పాలెంకు చెందిన ఆయన అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు.
మోహన్‌బాబు తండ్రి ఓ ఉపాధ్యాయుడు. ఏర్పేడు, తిరుపతిలో చదువుకున్న ఆయన తర్వాత మద్రాస్‌లో ఫిజిక్స్‌లో డిగ్రీ చదివారు. ఈ క్రమంలోనే సినీ రంగంపై ఆసక్తితో మద్రాస్‌లో చిన్న గదిలో ఉంటూ ఎన్నో అష్టకష్టాలు పడి నిలదొక్కుకున్నారు. మోహన్‌బాబు మద్రాస్ లో సినీ కెరీర్ ఆరంభ దశలో ఉండగానే ఆయనకు విద్యాదేవితో పెళ్లయ్యింది. విద్యాదేవికి మోహన్‌బాబు పగలంతా సినిమాల్లో బిజీబిజీగా ఉండి రాత్రికి ఇంటికి వస్తుండడంతో ఆమెకు ఇష్టం ఉండేది కాదట. భర్తను ఎంతో ప్రేమించే ఆమె కుటుంబానికి ఆయన ఎక్కడ దూరం అవుతారో అన్న బాధతో ఉండేదట.
ఈ దంపతులకు విష్ణు, లక్ష్మి పుట్టారు. అయితే మోహన్‌బాబు ఆ సమయంలో కెరీర్ మీద ఎక్కువుగా దృష్టి సారించడంతో పాటు విద్యాదేవిపై ఒక్కోసారి కోప్పడడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారన్న ప్రచారం ఉంది. అయితే విష్ణు, లక్ష్మిల భవితవ్యం దృష్ట్యా మోహన్‌బాబు గురువు దాసరి నారాయణ రావు చివరకు విద్యాదేవి చెల్లి నిర్మలతో మోహన్‌బాబుకు రెండో పెళ్లి చేశారు. ఈ విషయంలో మోహన్ బాబు తన గురువు మాట జవదాటలేదట.
ఈ దంపతులకు మనోజ్ పుట్టాడు. అయితే నిర్మలమ్మ మాత్రం తన అక్కడ బిడ్డలు ఇద్దరిని కూడా తన బిడ్డల్లా చూసుకునేవారు.
అసలు చాలా మందికి విష్ణు, లక్ష్మి కూడా నిర్మల పిల్లలే అన్నట్టుగా ఉంటారు. ఇక మోహన్‌బాబు సినిమా రంగం నుంచి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇక విద్యారంగంలోకి వచ్చి 1991లో విద్యానికేతన్ సంస్థలను తిరుపతి సమీపంలో స్థాపించారు.