నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈసారి దూకుడు పెంచాడని అనిపిస్తుంది. బర్త్ డే సందర్భంగా సినిమాలు ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. ఆల్రెడీ బింబిసారా సెట్స్ మీద ఉండగా డెవిల్ ఒకటి మరో రెండు సినిమాలు ఎనౌన్స్ చేశాడు. ఈ నాలుగు సినిమాలతో కళ్యాణ్ రామ్ తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే కళ్యాణ్ రామ్ ఈ దూకుడు వెనక యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఉన్నాడని టాక్.

హిట్ సినిమాకు దూరమవుతున్న అన్న కళ్యాణ్ రామ్ కు తారక్ వెనక ఉండి స్టోరీ సెలక్షన్ చేస్తున్నాడట. అంతేకాదు కళ్యాణ్ రామ్ సినిమాకు తన సలహాలను ఇస్తున్నారని తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ వరుసగా నాలుగు సినిమాలు చేయడంలో ఎన్.టి.ఆర్ హస్తం ఉందని టాక్. ఇదే దూకుడు కొనసాగిస్తే కళ్యాణ్ రామ్ కూడా స్టార్ రేసులో వచ్చే ఛాన్స్ ఉంది.  కళ్యాణ్ రాం తన సినిమాల స్టైల్ మార్చాడని మాత్రం అర్ధమవుతుంది.  

బింబిసారా హిస్టారికల్ సినిమాగా వస్తుండగా డెవి మాత్రం పిరియాడికల్ థ్రిల్లర్ గా వస్తుంది. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కొత్త లుక్ తో వస్తున్నారు. ఇక కెవి గుహన్ డైరక్షన్ లో 118 హిట్ అందుకోగా ఆ డైరక్టర్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. ఈస్ట్ కోస్ట్ మూవీ ప్రొడక్షన్ తో మరో సినిమా చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమాలతో కళ్యాణ్ రామ్ తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. తారక్ వెనక ఉన్నాడు అనగానే నందమూరి ఫ్యాన్స్ లో కూడా ఈసారి కళ్యాణ్ రామ్ పక్కా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడనే నమ్మకం కుదిరింది. కళ్యాణ్ రామ్ అసలు సిసలు టాలెంట్ ఏంటన్నది ఇప్పటి నుండి చూస్తారని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఈ జోష్ చూస్తుంటే నిజంగానే కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: