మీటూ అలాగే సంచలన తార శ్రీ రెడ్డి చేసిన క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఎంతో మంది బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న అనుభవాలు చెపుతున్నారు. చాలా మంది నటీమణులు బాహాటంగా తమకు ఎదురైన చేదు అనుభవాలు చెపుతున్నారు. సౌత్ టు నార్త్... కోలీవుడ్ టు బాలీవుడ్ ఇలా ఏ రంగంలో అయినా ఇప్పుడు ఛాన్సు ల పేరుతో లైంగీక దోపిడి అనేది కామన్ అయిపోయింది. అయితే క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం వెండి తెర మీద మాత్రమే కాదట.. బుల్లితెర మీద కూడా ఉందట. ఇటీవల బుల్లితెర నటీమణులు సైతం తమ లైంగీక దోపిడి అనుభవాలు చెపుతున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ బుల్లితెర నటీమణి కూడా తన అనుభవాన్ని పంచుకుంది. కార్తీకదీపం లో మోనిత వద్ద పని మనిషి ప్రియమణి ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కమిట్మెంట్స్ అనేవి ఇండస్ట్రీలో కామన్ అని.. తాను కూడా గతంలో అలాంటివి ఫేస్ చేశానని చెప్పింది. ఓ సీరియల్ ఛాన్సు కోసమే ఆమెకు ఈ అనుభవం ఎదురైందట. ఇక అల్లు అర్జున్ పుష్పలో ఆమె ఓ పనిమనిషి క్యారెక్టర్లో నటిస్తోంది.