టాలీవుడ్ హీరోలో మ‌న్మ‌థుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో కింగ్ నాగార్జున. నాగ్ మొద‌టి నుండి రొమాంటిక్ హీరోగానే కొన‌సాగుతున్నారు. అయితే ఇప్పుడు ఆయ‌న‌కు 61 ఏళ్లు వ‌చ్చినా కూడా అదే అందంతో క‌నిపించ‌డం విశేషం. ఇక ఇప్ప‌టికీ నాగ్ ఆడియో ఫంక్ష‌న్ వేదికలపై కనిపించినా ప్రతి ఒక్కరు అడిగే మాట మీరు 61 సంవత్సరాల వయసులో కూడా ఇంత ఫిట్ గా ఎలా ఉంటున్నారు. మీ డైట్ ఏంటి... మీ డైలీ యాక్టివిటీస్ ఏంటి..? ఇలా ఎవరికి తోచిన ప్రశ్నలు వారు అడుగుతూనే ఉంటారు. అలా  వారు  అడగడానికి కారణం నాగార్జున గారు ఏ పబ్లిక్ ఈవెంట్ లో కనిపించినా కుర్రాళ్ల కంటే యంగ్ గా క‌నిపించ‌డ‌మే. దానికి తోడు 'డమరుకం' సినిమా సమయంలో  దాదాపు 53 సంవత్సరాల పై బడిన వయసులో తన సిక్స్ ప్యాక్ తో క‌నిపించి అవాక్కయ్యేలా చేశారు. 

ఇది కేవలం నాగార్జున కు మాత్రమే సాధ్యం అని అభిమానులతో అనిపించుకున్నాడు. ఇలా టాలీవుడ్ సీనియర్ హీరోల అందరిలో మన్మధుడి గా పేరు తెచ్చుకున్న కింగ్ నాగార్జున ఫోటో ఒకటి ప్ర‌స్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. కానీ ఈ ఫోటో చూసిన తర్వాత మాత్రం నాగార్జునను మన్మథుడు అని అనడానికి కొంచెం ఆలోచించాల్సిందే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫోటోలో నాగార్జున తెల్ల జుట్టు, తెల్లని గడ్డంతో 60  సంవత్సరాలు నిండిన వ్యక్తి లానే ఉన్నాడు. ఇక ఫోటోలో నాగార్జున పక్కన ఒక అమ్మాయి నిలుచుంది. ఆమె తో దిగిన సెల్ఫీ ఫోటో నే ఇప్పుడు వైరల్ అవుతోంది.

అయితే ఆ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు..? నాగ్ ఇలాంటి గెట‌ప్ లో ఎందుకు క‌నిపిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండ‌గా ఈ ఫోటో పై ప్ర‌స్తుతం నెట్టింట తెగ ట్రోల్స్ వ‌స్తున్నాయి. అయితే కొంద‌రు అది ఓ సినిమా కోసం వేసిన గెట‌ప్ అంటుండ‌గా మేకప్ వేయ‌క‌పోయినా ఇప్పుడు అలాగే ఉంటార‌ని కామెంట్ పెడుతున్నారు. నాగ్ ఫోటోకు నాగ్ తాత అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇక మ‌రికొంద‌రు ఏజ్ గురించి మ‌న‌కెందుకు సినిమాల్లో అయితే యంగ్ గా క‌నిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక‌  ప్రస్తుతానికి నాగార్జున రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: