ఈనాడు రామోజీరావు నుండి కొత్త ఓటిటి ఒకటి స్టార్ట్ అవుతుందని వార్తలు వచ్చాయి. మరోపక్క సురేష్ బాబు, నాగార్జున కలిసి సొంత ఓటిటి ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. వీటితో పాటుగా దిల్ రాజు కూడా తన సొంతంగా ఒక ఓటిటి ప్లాన్ చేస్తున్నారట. ఎలాగు ప్రొడక్షన్ ఉంది కాబట్టి ఒరిజినల్ కంటెంట్ కు కొదవ ఉండదు. అప్కమింగ్ డైరక్టర్స్ తో మంచి వెబ్ సీరీస్, ఇండిపెండెంట్ సినిమాలు చేయొచ్చని దిల్ రాజు మెగా ప్లాన్. దీనికి రాం చరణ్ కూడా సపోర్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది.
దిల్ రాజు సొంత ఓటిటి పెడితే మాత్రం వర్క్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు. తెలుగులో ఆహా సక్సెస్ అవగా ఇప్పుడు కొత్తగా వస్తున్న ఓటిటిలు కూడా ఆహా రూట్ ను ఫాలో అవుతున్నాయి. ఆహా కూడా ఒరిజినల్ కంటెంట్ తో వెబ్ సీరీస్ లు బాగానే ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా ఆహా ప్రమోషన్స్ బాగా చేస్తుంది. అందుకే ఆ రేంజ్ లో క్లిక్ అయ్యింది. ఓటిటి రంగంలోకి దిల్ రాజు కూడా దిగితే పోటీ పెరుగుతుందని చెప్పొచ్చు. దిల్ రాజు ఓటిటి పై మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. దిల్ రాజు ఓటిటి వస్తే మాత్రం ఆహా మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది.