మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంత మంది ఉన్నారో అందరినీ తన అభిమానులగా సొంతం చేసుకున్న నటుడు రామ్ చరణ్. ఇప్పుడు టాలీవుడ్ హీరోలలో నెంబర్ వన్ హీరోలలో ఈయన కూడా ఒకరు. తన మొదటి సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటుడు. ఇక ఆ తర్వాత వచ్చిన మగధీర  సినిమాలో నటించి , దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించి, మంచి గుర్తింపు పొందిన నటుడు. ఒకానొక సమయంలో తెలుగు ఇండస్ట్రీని తిరగరాసి రికార్డులను కూడా క్రియేట్ చేశాడు.


2012 జూన్ 14న ఉపాసన కామినేని, రామ్ చరణ్ వివాహం పెద్దల వేడుకలో జరిగింది. ఇక టాలీవుడ్ లో  అత్యధిక సంపన్నుల దంపతులలో వీరు కూడా ఒకరు. ఇక కరోనా సమయంలో ఉపాసన తన వంతు సహాయంగా హాస్పిటల్ బిల్లు ను తగ్గించే వ్యవహారంలో ఎంతో సహాయపడింది ప్రజలకి. ఇక తన మామ కూడా మెగాస్టార్ తన వంతు సహాయంగా ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించి, ఆక్సిజన్ సిలిండర్ లను సరఫరా చేశారు.

ఇక రామ్ చరణ్ ఉపాసన సమయం దొరికినప్పుడల్లా బయటికి వెళ్తుంటారు. ఇక రామ్ చరణ్ సినిమాలతో బిజీగా ఉండడంతో సమయం దొరికినప్పుడల్లా తన భార్య కోసం టైం కేటాయిస్తూ ఉంటాడు. అలా తన భార్యతో కలిసి"లంచ్ డేట్" కు వెళ్ళారు. ఇక ఉపాసన   ఒక సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అంతేకాకుండా "mid week lunch date" అని ట్వీట్ చేసింది.


ఇద్దరు కలిసి రెస్టారెంట్ లో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా చాలా కాలం గ్యాప్ తర్వాత డిన్నర్ చేయడంతో ఉపాసన ఎంతో సంతోషించింది. ఇక చరణ్ ని తను ముద్దుగా"మిస్టర్ సి"అని పిలుచుకుంటుందట. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ,రాజమౌళి డైరెక్షన్ లో rrr లో నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కూడా మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాలని కోరుకుందాం.



మరింత సమాచారం తెలుసుకోండి: