టాలీవుడ్ లో మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఇక మహేష్ బాబు నటించిన నిజం చిత్రం ద్వారా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని తేజ దర్శకత్వంలో నటించారు. అయితే మూవీ గురించి మరికొన్ని విశేషాలు అందులోనూ మనకు తెలియని మరికొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సినిమాలో మహేష్ బాబు, గోపీచంద్, రక్షిత, రాశి కలిసి నటించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం ఆర్పీపట్నాయక్ అందించారు. ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి  కారణమేంటో డైరెక్టర్ తేజ ఒకానొక ఛానల్ ద్వారా  ఇంటర్వ్యూలో తానే స్వయంగా తెలిపారు. అలా ఎందుకు అన్నారో తెలుసుకుందాం.

ఇక అసలు విషయానికొస్తే, ఒక్కడు సినిమాతో బ్లాక్ బాస్టర్ మూవీగా స్టార్ డమ్ సంపాదించుకున్న మహేష్ బాబు. అలా సంపాదించుకున్న స్థానం తర్వాత విడుదలైన సినిమా"నిజం".ఇక ఈ సినిమా 2003 మే 24న విడుదల అయింది. ఈ సినిమాను కొనడానికి బయ్యర్లు చాలామంది వచ్చారు. ఈ సినిమాకి రూ. 7 కోట్ల మేరకు ఖర్చు అయితే దాదాపు రూ.21 కోట్ల వరకు బిజినెస్ చేసింది.

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకి ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు నిస్సహాయుడు గా ఉండడం వల్ల ఈ సినిమాకి మైనస్ గా మారింది. అంతే కాకుండా తల్లి సహాయం లేకుండా ఎటువంటి పని చేయలేడా.? అనే తరహాలో హీరో ఉండడంచేత ప్రేక్షకులను నిరుత్సాహ పరిచారు. ఇందులో గోపీచంద్  ని విలన్ గా బాగా చూపించడం, హీరో ని సరిగ్గా చూపించ లేకపోవడం తమ అభిమానులకు నచ్చలేదు. ఈ విషయాలను స్వయంగా డైరెక్టర్ తేజ ఒకానొక సమయంలో వివరించారు.


ఇక ఈ సినిమాకి గాను మహేష్ బాబు కు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. సపోర్టింగ్ రోల్ గా తాళ్లూరి రామేశ్వరి గారికి పురస్కారం దక్కింది.


మరింత సమాచారం తెలుసుకోండి: