ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇన్నాళ్లకు తన కరెక్ట్ రూట్ లో పడ్డాడని చెప్పొచ్చు. ప్రేక్షకులు తనని ఎలా చూడాలని అనుకుంటున్నారు అన్న కన్ ఫ్యూజన్ లో ఇన్నాళ్లు రకరకాల ప్రయత్నాలు చేసిన రామ్, పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హిట్ అందుకున్నాడు. రామ్ కెరియర్ లో హయ్యెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ తో రామ్ కు ఒక క్లారిటీ వచ్చేసింది. మాస్ సినిమాలతోనే తన ఫ్యాన్స్ ను.. ఆడియెన్స్ ను మెప్పించాలని ఫిక్స్ అయ్యాడు.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత మాస్ రీమేక్ గా వచ్చిన రెడ్ కూడా రామ్ కెరియర్ లో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో రామ్ డబుల్ మాస్ యాక్షన్ ఆడియెన్స్ ను భలే థ్రిల్ చేసింది. ఇస్మార్ట్ శంకర్, రెడ్ రెండు వరుస సినిమాలు హిట్ అవడంతో తన కెరియర్ పై పర్ఫెక్ట్ క్లారిటీ తెచ్చుకున్న రామ్ తన ఫార్మెట్ ఇదే అని ఫిక్స్ అయ్యాడు. అందుకే తన నెక్స్ట్ సినిమా కోలీవుడ్ మాస్ డైరక్టర్ లింగుసామితో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా మాస్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తుంది.

రామ్ కెరియర్ లో మొదటిసారి పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. లింగుసామి సినిమాలో రామ్ ఉప్పెన బ్యూటీ కృతి శెట్టితో రొమాన్స్ చేస్తున్నాడు. సినిమాలో కృతి శెట్టి కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తుంది. సినిమా ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా స్టోరీ విని సింగిల్ సిట్టింగ్ లోనే రామ్ మూవీ కన్ఫర్మ్ చేశాడట. మొత్తానికి రామ్ తన మాస్ ఫార్మెట్ లోనే వెళ్తూ ఆడియెన్స్ ను మెప్పించాలని చూస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: