ఇక ఈ సినిమా కోసం లింగుసామి 6 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. హీరో రాం 12 కోట్ల రెమ్యునరేషన్ తో పాటుగా బిజినెస్ లో ప్రాఫిట్ అంటే అలా ఓ 3 కోట్లు మొత్తం 15 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. ఇస్మార్ట్ శంకర్, రెడ్ హిట్ తర్వాత రాం తన రెమ్యునరేషన్ పెంచాడు. మొన్నటివరకు 10 కోట్లౌ అటు ఇటుగా ఉండే రామ్ ఇప్పుడు సినిమాకు 15 కోట్లు తక్కువ తీసుకోవట్లేదని తెలుస్తుంది. కొన్నాళ్లుగా తెలుగులో డైరెక్ట్ సినిమా చేయాలని చూస్తున్న లింగుసామికి రామ్ ఛాన్స్ ఇచ్చాడు.
ఈ సినిమా కథ విన్న వెంటనే రామ్ ఓకే చెప్పాడట. పవర్ ఫుల్ స్టోరీతో వస్తున్న రామ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడని అంటున్నారు. సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా స్పెషల్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. సినిమాలో రామ్ ఎనర్జీ అదిరిపోతుందని అంటున్నారు. మరి లింగుసామి, రామ్ ల క్రేజీ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి. రామ్ ఈ సినిమా కోసం స్పెషల్ వర్క్ అవుట్స్ చేస్తున్నాడని తెలుస్తుంది.