ప్రముఖ తెలుగు నటుడు, సినీ విమర్శకులు, రాజకీయ విశ్లేషకులు, రచయిత, దర్శకుడు కత్తి మహేష్‌ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల తెలుగు పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. ఇంకా చాలా మంది నటులు, ప్రముఖులు, ఆయన ఫ్యాన్స్‌... కత్తి మహేష్‌ మృతి పట్ల తమ సంతాపం తెలుపుతున్నారు. అయితే.. జనసేనాని అధినేత పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం... సంతాపం తెలపాల్సి పోయి... చాలా అసభ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ హీరో పవన్ కళ్యాణ్‌ను అప్పట్లో దూషించినందుకే ఇలా జరిగిందని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పెడుతున్నారు. అలాగే కొంత మంది పవన్‌ ఫ్యాన్స్‌.. మాత్రం కత్తి మహేష్‌ మృతి పట్ల తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. కత్తి మహేష్‌కు వ్యతిరేకంగా శ్రీ రెడ్డి రెచ్చిపోయింది. శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ అంశం మొదలెట్టక ముందు నుంచి కత్తి మహేష్ కు మంచి ఫ్రెండ్. మరో వైపు సందు దొరికితే పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడే విమర్శకురాలు. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ మరణం తర్వాత సోషల్ మీడియాలో ఆయనపై వస్తున్న కామెంట్స్ చూసి రెచ్చిపోయింది. మరోసారి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని రెచ్చగొడుతున్న తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేసింది.

 "అందరూ వెనక ముందు పోవాల్సిందే... కత్తి మహేష్ మరణాన్ని కూడా పండగ చేసుకునే వాళ్ళకు, అపహాస్యం చేసే వాళ్ళకి ఇదేనా ఆన్సర్....  రేపో, ఎల్లుండో మీరు కూడా పోవాలి. మీ హీరో కూడా పోతాడు... మీరేదో యుగపురుషులు లాగా... ఎందుకురా పోజులు ? బుర్ర అప్పుడప్పుడు వాడండి.... కత్తి మహేష్ ఆత్మకు శాంతి చేకూరాలి " అంటూ  శ్రీ రెడ్డి తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. ఇది చూసి పవన్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారు.  నెక్స్ట్ నువ్వే పోయేది రెడీగా ఉండు.... అంటూ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ మరో వివాదానికి దారితీశాయి. అయితే.. దీనిపై శ్రీరెడ్డి స్పందించలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: